Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సాఫ్ట్ వేర్ సీతారాం ఆత్మహత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి!
posted on: Apr 30, 2026 1:33PM

హైదరాబాదు నగరాన్ని కుదిపేసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది. భార్య అక్రమ సంబంధాలు, ప్రైవేట్ వీడియోల పోస్టింగ్, కుటుంబ కలహాలు…చివరకు మానసిక వేదన భరించలేక ఆత్మహత్య...ఈ ఘటనలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు పోలీసులు సీతారాం భార్య రేణుక, ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులను తాజాగా అరెస్టు చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సీతారాం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మొదట ఇది సాధారణ ఆత్మహత్యగా పోలీసులు భావించారు. అయితే ఆ తరువాత లభించిన 19 పేజీల సూసైడ్ నోట్ కేసు దిశను పూర్తిగా మార్చింది. సీతారాం ఆత్మహత్య చేసుకోబోయే ముందు రాసిన సూసైడ్ నోట్ లో సీతారాం తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న మానసిక వేదనను వివరంగా పేర్కొన్నాడు.
సీతారాం తన భార్య రేణుకకు ముగ్గురితో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆ లేఖలో తీవ్ర ఆరోపణలు చేశాడు. తాను నెలకు రెండు లక్షల జీతం సంపాదిస్తూ భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్నాననీ.. , కానీ తనకు తెలియకుండా ఆమె ఇతరులతో సంబంధాలు కొనసాగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంత నచ్చజెప్పినా ఆమె వ్యవహారశైలి మారలేదని.. మధ్యతరగతి వ్యక్తిగా భార్యను గుడ్డిగా నమ్మడమే తాను చేసిన పెద్ద తప్పు అంటూ అతను సూసైడ్ నోట్‌లో రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సీతారాం పేర్కొన్నాడు.
ఈ కేసు దర్యాప్తులో మరో షాకింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. రేణుకతో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోలను ఆమె ప్రియుడు రమణరెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై గతంలోనే పెద్ద వివాదం చోటుచేసుకొని, రేణుక, రమణ రెడ్డి ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.
సీతారాం వదిలిన సూసైడ్ నోట్‌ను కీలక ఆధారంగా పోలీసులు కేసును మరింత లోతుగా విచారించారు. ఇటీవల పోలీసులు రేణుకతో పాటు ఆమె ప్రియుడు రమణ రెడ్డి, మరో వ్యక్తి శ్రవణ్‌లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.


.webp)



