Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజస్థాన్ రాయల్స్‌కు షాక్.. నడవలేని స్థితిలో మైదానం వీడిన వైభవ్ సూర్యవంశీ
posted on: Apr 27, 2026 8:42AM

15 ఏళ్లకే పరుగుల మోత మోగిస్తూ, రికార్డుల దుమ్ము దులుపుతున్న వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీకి గాయమైంది. దాంతో రాజస్థాన్ రాయల్స్ కు కీలక తరుణంలో పెద్ద షాక్ తగిలింది. శనివారం (ఏప్రిల్ 25) జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ గాయపడ్డాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా బంతిని ఆపే క్రమంలో 15 ఏళ్ల వైభవ్ గాయంతో మైదానాన్ని వీడాడు. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ జోరు మామూలుగా లేదు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. 15 ఏళ్ల వయసులో రికార్డుల మోత మోగిస్తూ.. క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా గాయపడటం జట్టుతో పాటు అభిమానులను తీవ్రంగా కలవరపరుస్తోంది.
సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ మరో సెంచరీ నమోదు చేసాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. కానీ ఆ తర్వాత ఫీల్డింగ్ చేస్తూ వైభవ్ సూర్యవంశీ గాయ పడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో నొప్పితో బాధపడ్డాడు. సహాయక సిబ్బంది సహకారంతో మైదానం నుంచి బయటకు వెళ్లాడు. వైభవ్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన ఓవర్ పిచ్ బంతిని ఇషాన్ కిషన్ కవర్స్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఆ బంతిని అడ్డుకోవడానికి సర్కిల్ లోపల ఉన్న వైభవ్ సూర్యవంశీ వెనక్కి పరిగెత్తాడు. అయితే బంతిని వెంబడిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అతనికి హామ్‌స్ట్రింగ్ పట్టేసింది. వెంటనే నడవలేక మైదానంలోనే కూలబడిపోయాడు.
వైభవ్ ఇబ్బంది పడటం చూసి వెంటనే ఫిజియోలు మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. కానీ నొప్పి తీవ్రంగా ఉండటంతో అతను లేచి నడవలేకపోయాడు. కనీసం అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఇబ్బంది పడటంతో, సపోర్ట్ స్టాఫ్ అతనిని భుజాల మీద మోసుకుంటూ మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే వైభవ్ సేవలు చాలా అవసరం. ఈ హామ్‌స్ట్రింగ్ గాయం తీవ్రమైంది అయితే.. వైభవ్ కనీసం 2-3 వారాల పాటు ఆటకు దూరం కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. తొడ కండరాల గాయంతో మైదానం వీడిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరం అవుతాడేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. విశ్రాంతి తీసుకోవటం ద్వారా వైభవ్ త్వరగా కోలుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు.



.webp)


