కేరళలో... కిస్ ఆఫ్ లవ్ సీజన్ 2 షురు!

posted on: Mar 9, 2017 5:10PM

కిస్ ఆఫ్ లవ్ సీజన్ 2! ఇదేంటి అంటారా? మరేం లేదు కేరళలోని కొచ్చి నగరంలో ముద్దుల గోల మొదలు పెట్టాలని వామపక్ష విద్యార్థి సంఘాలు డిసైడ్ అయ్యాయి. అసలే హిందూ సంస్థలు ఏమైనా చేస్తే చెలరేగిపోయే తత్వం సీపీఎం, సీపీఐ పార్టీలది. ఇక వాటి అనుబంధ వి్ద్యార్థి సంఘాల గురించైతే చెప్పేదే లేదు! మరీ ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ లాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ప్ యమ ఉత్సాహంతో ముద్దులకు రెడీ అయిపోతాయి!

 


2014లో కిస్ ఆఫ్ లవ్ అనే ఉద్యమం ఎంత కలకలం రేపిందో గుర్తిందిగా? అప్పట్లో హిందూ సంస్థలు మోరల్ పోలీసింగ్ చేస్తున్నాయని ఆరోపిస్తూ లెఫ్ట్ విద్యార్థులు, ఉద్యమకారులు పబ్లిగ్గా చుంబనాలకు తెగబడ్డారు. కొచ్చి నగరంలో ఈ ఎంగిలి ఉద్యమాలు భీకరంగా జరిగాయి. మన దగ్గర హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఓ రేంజ్లో జరిగాయి. ఇక దానికి వ్యతిరేకంగా ఏబీవీపీ మొదలు బీజేపి దాకా రైట్ వింగ్ సంస్థలు కూడా అదే రేంజ్లో విరుచుకుపడ్డాయి. వాళ్లవి ముద్దులైతే, వీళ్లవి గుద్దులన్నట్టు నడిచింది వ్యవహారం!

 


2014నుంచి కొంత గ్యాప్ ఇచ్చాక కిస్ ఆఫ్ లవ్ సీజన్ 2 ఇప్పుడు మొదలైంది! అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కేరళలో కొందరు శివసేన కార్యకర్తలమని చెప్పుకుంటూ మెరైన్ బీచ్ ప్రాంతంలో దాడులు చేశారు. కేవలం ఆరుగురు మాత్రమే వచ్చి అమ్మాయిలు, అబ్బాయిలపై దాడులు చేస్తుంటే పోలీసులు కళ్లప్పగించి చూస్తున్నారు. ఆ పోలీసులు కేరళను పాలిస్తున్న సీపీఎం పార్టీ ఏలుబడిలోనే వున్నారు. అయినా దాడి చేయనిచ్చారు ఖాకీలు. తరువాత భారీ నిరసనలకు దిగిన కాంగ్రెస్ , దాని అనుబంధ విద్యార్థి సంఘాలు, సీపీఎం, దాని అనుబంధ విద్యార్థి సంఘాలు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి గోల మొదలు పెట్టాయి. మిగతా సంఘాల్ని వెనక్కి తోసి లెఫ్ట్ సంఘాలు ఒక అడుగు ముందుకు వేసి కిస్ ఆఫ్ లవ్ సీజన్ టూ మొదలు పెట్టాయి. అధికారంలో వుంది కూడా సీపీఎం ప్రభుత్వమే కాబట్టి ఈ కిస్ ఆఫ్ లవ్ ఎలా జరుగుతుందని అందరికీ ఆసక్తిగా వుంది! తమ పార్టీ తాలూకూ విద్యార్థి సంఘమే ఇలా అరాచక ఉద్యమానికి పిలుపునివ్వటం కేరళ సీపీఎం ఎలా సమర్థించుకుంటుందో?

 


శివసైనికులు మెరైన్ బీచ్ లో దాడులు చేయటం నీచమైన పని. ఆ సిగ్గులేని పనికి ఎదురు తిరిగి నిరసన తెలపటం చాలా గొప్ప విషయం. కాని, అతి ఆవేశానికి పోయి అందరి ముందు చులకనగా తయారయేలా పబ్లిక్ కిస్పింగ్ కు తెగబడటం ఎవ్వరూ హర్షించరు! స్వేచ్ఛ అంటే రోడ్డు మీద ఆడ, మగా తేడా మరిచి కిస్ చేసుకోవటమే అయితే... అది ఖచ్చితంగా పాశ్చాత్య ఎంగిలి సంస్కృతే అవుతుంది తప్ప మనది కాదు!

google-ad-img
    Related Sigment News
    • Loading...