పవన్ ప్రశ్నలకు వైకాపా జవాబు ఇవ్వలేదేమి?

posted on: May 5, 2014 11:45AM

 

తెదేపా-బీజేపీ అభ్యర్ధుల తరపున పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారంతో వైకాపాకు ఎంతో కొంత నష్టం జరగడం తధ్యమని చెప్పేందుకు పెద్ద రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. రాజకీయాలలోకి అకస్మాత్తుగా ఊడిపడిన అయన, తమ ఐదేళ్ళ శ్రమను బూడిదలో పోసిన పన్నీరు చేయబోతుంటే వైకాపా కన్నీరు పెట్టుకోవడం, ఆ ఆవేదన ఆగ్రహంగా మారడం కూడా అంతే సహజం.

 

అందుకే షర్మిల, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా పవన్ కళ్యాణ్ కు మతిస్థిమితం లేకుండా ఏదేదో వాగుతున్నాడని, ఆయన మాటలు పట్టించుకోవద్దని ప్రజలకు హితవు చెపుతున్నారు. అయితే నేటికీ కూడా పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు వారిరువురూ కూడా జవాబే చెప్పలేకనే, వారు విషయం పక్క దారి పట్టిస్తున్నారని అర్ధమవుతూనే ఉంది.

 

సీమంధ్ర ప్రజలను నోటికి వచ్చినట్లు కేసీఆర్ తిడుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయనని ఎదుర్కోలేదు? ఎందుకు ఆయనను పల్లెత్తు మాట అనలేదు? కేసీఆర్ ని చూసి ఎందుకు జగన్ భయపడుతున్నారు? వారిరువురి మధ్య ఉన్న అనుబందం ఏమిటి? తెలంగాణాలో అడుగుపెట్టే సాహసం కూడా చేయలేని జగన్మోహన్ రెడ్డి అక్కడ నివసిస్తున్నసీమాంధ్రులను ఏవిదంగా కాపాడగలరని ప్రశ్నించారు. సీమాంద్ర ప్రజలను, వారి ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా తాను వారికీ ముఖ్యమంత్రి అవుదామని భావిస్తున్నారు? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు జగన్ కానీ షర్మిల గానీ నేరుగా ఇంతవరకు జవాబు చెప్పలేకపోయారు. అందుకే పవన్ కళ్యాణ్ పిచ్చిపిచ్చిగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని షర్మిల, జగన్ ఎదురుదాడికి దిగారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...