Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇక పురషుల్ని కూడా గర్భగుడిలోకి రానివ్వరట
posted on: Apr 4, 2016 11:56AM

శనిసింగనాపూర్ ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. అలాంటి తలనొప్పుల నుంచి తప్పించుకోవడానికి మహారాష్ట్రలోని మరొక సుప్రసిద్థ పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వరాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించకుండా పురుషులపై ఆలయ ధర్మకర్తల మండలి నిషేధం విధించింది. శనిసింగనాపూర్ ఆలయంలో లాగే త్రయంబకేశ్వర ఆలయంలోకి మహిళలకు ప్రవేశం నిషిద్ధం. అయితే తమకు అన్నింట్లో పురుషులతో పాటు సమానహక్కు ఉందని, ఆలయాల్లో కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని మహారాష్ట్రకు చెందిన భూమాత బ్రిగేడ్ మహిళా కార్యకర్తలు బొంబే హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆలయ ప్రవేశానికి సంబంధించి పురుషులతో పాటు మహిళలకూ సమానహక్కు ఉందంటూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును అనుసరించి భూమాత బ్రిగేడ్ కార్యకర్తలు రెండు రోజుల క్రితం శనిసింగనాపూర్ ఆలయంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. వీరి ప్రయత్నాన్ని స్థానికులు, పోలీసులు, దేవాలయ అధికారులు అడ్డుకున్నారు. సంప్రదాయాల్ని, ఆలయ కట్టుబాటుని అంగీకరించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అలాంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న త్రయంబకేశ్వరాలయ ధర్మకర్తల మండలి ఇవాళ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో హైకోర్టు తీర్పును, శనిసింగనాపూర్ ఘటనను చర్చించారు. శనిసింగనాపూర్ తరహా ఘటనలను ఇక్కడ చోటు చేసుకోకుండా చూడటంతో పాటు కోర్టు తీర్పును గౌరవించాలని నిర్ణయించారు. దీంతో పాటు లింగ సమానత్వానికి ప్రాధాన్యత నిచ్చే దిశగా మహిళలతో పాటు పురుషులని ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది.






