Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సింహం Vs నక్క.. శంబాల టీమ్ భారీ సోషియో ఫాంటసీ.. హీరో ఎవరంటే?
posted on: Mar 21, 2026 3:23PM
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ వరుస విలక్షణమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రీసెంట్ గా 'ఊరు పేరు భైరవకోన', 'రాయన్' వంటి చిత్రాలతో విజయాలను అందుకున్న ఈ హీరో, ఇప్పుడు తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'శంబాల' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్ లో సింహం మరియు నక్కల మధ్య పోరాటాన్ని చూపిస్తూ పవర్, విధి, ఆధిపత్యం అనే అంశాలను హైలైట్ చేశారు. "సమ్ వార్స్ నెవర్ ఎండ్.. సమ్ కింగ్స్ నెవర్ డై" అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ సినిమా థీమ్‌పై భారీ అంచనాలను పెంచుతోంది.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించనున్నారు. 'శంబాల' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత అదే ప్రొడక్షన్ హౌస్ మరియు డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈసారి అంతకు మించిన గ్రాండియర్‌తో ఈ సోషియో ఫాంటసీని తెరకెక్కించబోతున్నారు.
సందీప్ కిషన్ ఈ చిత్రంలో గతంలో ఎన్నడూ చూడని సరికొత్త గెటప్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. యాక్షన్‌కి ఫాంటసీ అంశాలను జోడించి పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ మరియు రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మిగిలిన నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. 'శంబాలస టీమ్‌తో సందీప్ కిషన్ చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.






