Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Shalini Pandey: అర్జున్ రెడ్డి భామ షాలిని వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించి.. ఇష్టం ఉందంటారా లేక!
posted on: Feb 28, 2026 10:58AM

-ప్రీతి శెట్టి గా చేసిన షాలిని పాండే గుర్తుంది కదా
-విజయ్ దేవరకొండ తో సూపర్ కెమిస్ట్రీ ని పండించింది
-తాజా ఇంటర్వ్యూ లో కీలక వ్యాఖ్యలు
హీరోయిన్స్ తమ సొంత పేరుతోనే, కలిసొచ్చేపేరుతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం సహజం. కానీ సినిమాలోని తమ క్యారక్టర్ పేరుతో సెటిల్ అయ్యే అదృష్టం కొంత మంది హీరోయిన్స్ ని మాత్రమే వరిస్తుంది. అటువంటి ఒక హీరోయిన్ షాలిని పాండే(Shalini Pandey). అర్జున్ రెడ్డి(Arjun Reddy)తో సినీ ఆరంగ్రేటం చేసిన షాలిని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల సినీ హృదయంలో డాక్టర్ 'ప్రీతి శెట్టి' గానే స్థానాన్ని పొందింది. దీన్నిబట్టి సదరు క్యారక్టర్ లో ఆమె ఎంత ఇన్ వాల్వ్ అయ్యి చేసిందో అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో మనిషి తనని తాను తెలుసుకోవడం ఎలాగో చెప్పి అభిమానులు, ప్రేక్షకుల ఋణం తీర్చుకుంటుంది. ఆ మాటలని చూద్దాం.
షాలిని మాట్లాడుతు మనుషుల నిజ జీవితాల గురించి తెలుసుకోవడానికి చిన్న చిన్న గ్రామాలకి సోలో ట్రిప్ వెళ్తుంటాను.జీవితంలో ఒక్కసారైనా అందరూ సోలో ట్రిప్ చెయ్యాలి. ఆ విధంగా వెళ్లకపోతే మీ ఇష్టాలేంటనేవి మీకు తెలియవు. మీరు ఎవరితోనైనా ఉన్నపుడు ప్రతి దాని గురించి అభిప్రాయాలని మాత్రమే పంచుకుంటారు .కానీ ఎవరు లేని సందర్భంలో మీతో మీరు ఉండగలరా? అలా ఉంటేనే మీరంటే ఏంటో మీకు తెలుస్తుంది.? ప్రయాణాలు మనలో ఎన్నో మార్పులు తీసుకొస్తాయి. సంబంధం లేని వ్యక్తులని కలిసి లోకల్ వాతావరణపు అలవాట్లు, ఆలోచనలు తెలుసుకోవడం జీవితానికి ఎంతో ఉపయోగం. అందరికి అలా అనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ప్రయాణాల ద్వారా కొత్త శక్తీ వస్తుంది. మీకు మీరంటే ఇష్టమేనా అని కూడా తెలుసుకోవచ్చని షాలిని చెప్పుకొచ్చింది.
also read: విజయ్ కి షాక్ ఇచ్చిన సంగీత.. ఆ నటి ఈమె నేనా!
అభిమానులు కూడా ఆమె మాటలకి ఏకీభవిస్తూ మీరు చెప్పినట్టే చేస్తామనే కామెంట్స్ తో నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి తో వచ్చిన క్రేజ్ తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తనదైన శైలిలో దూసుపోతుంది. గత ఏడాది ధనుష్ తో కలిసి 'ఇడ్లి కడై' లో మెరిసిన షాలిని రీసెంట్ గా 'బంద్ వాలే'(BandWaale)అనే వెబ్ సిరీస్ తో అమెజాన్ ప్రైమ్ వేదికగా సందడి చేస్తుంది. ఈ సిరీస్ ప్రమోషన్ సందర్భంగానే అభిమానులు, ప్రేక్షకులకి ట్రిప్ సలహాలు ఇస్తున్న షాలిని ఈ ఏడాది జనవరి లో 'రాహు కేతు' అనే హిందీ చిత్రంలో కనిపించింది.





