Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు...ఆరెంజ్ అలర్ట్ జారీ
posted on: Mar 6, 2026 2:42PM

తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40° డిగ్రీలు దాటుతున్నాయి.ఈ నేపథ్యంలో వాతావరణశాఖ 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 40° డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. మిగత అన్ని జిల్లాల్లో 36°నుండి 40°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఎండలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. గత ఎప్పుడూ లేనంతగా మార్చిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు డీహైడ్రేషన్‌కు, వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.



.webp)


