Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మదనపల్లిలో ఏడేళ్ల బాలికపై హత్యాచారం
posted on: Feb 17, 2026 11:34AM
.webp)
అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో ఏడేళ్ల బాలిక హత్యాచారానికి గురైంది. గుండెలనిలిచే విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటూ.. సోమవారం (ఫిబ్రవరి 16)సాయంత్రం అదృశ్యమైన చిన్నారి తెల్లవారేసరికి పక్కింట్లోనే హత్యాచారానికి గురై కనిపించింది. వివరాలిలా ఉన్నాయి. సోమవారం (ఫిబ్రవరి 16) సాయంత్రం అదృశ్యమైన ఏడెళ్ల రిషిక ప్రియ పక్కింట్లోనే శవమై తేలడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే రిషిక ప్రియ సోమవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైంది. రాత్రి కావస్తున్నా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు స్థానికంగా ఉన్న అనుమానితులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో పక్కింట్లోనే నివసించే ఒక వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అతని ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీలలో బాలిక మృతదేహం ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో ఉండటం గుర్తించారు. నిందితుడు బాలికకు చాక్లెట్లు ఇస్తాననీ, మరేదైనా మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ తర్వాత బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించి, ఆమె కేకలు వేస్తుందన్న భయంతోనో గొంతు నులిమి చంపేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. హత్య అనంతరం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి దాచేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


.webp)



