Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గీతం యూనివర్సిటీకి సుప్రీంలో చుక్కెదురు!
posted on: Feb 16, 2026 3:14PM
.webp)
విద్యుత్ బకాయిల వివా దంలో గీతం యూనివర్శిటీ కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నాలుగు వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో విబిసి ఫెర్రో అలాయ్స్ సంస్థతో గీతం యూనివర్శిటీకి ఉన్న సంబంధంపై తుది నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
విద్యుత్ బకాయిల కేసు నేపథ్యంలో గీతం యూనివర్శిటీ రూ.54 కోట్లు చెల్లించాలని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ యూనివ ర్శిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే . ఈ కేసు విచారణలో భాగంగా ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు, విబిసి ఫెర్రో అలాయ్స్ కంపెనీకి సంబంధించిన విద్యుత్ బకాయిలను తమపై మోపడం చట్టవిరుద్ధమంటూ, గీతం యూనివర్శిటీ తరఫు న్యాయవాదులు తమ వాదన వినిపించారు. విబిసి సంస్థ నుంచి భూములు కొనుగోలు చేసినప్పటికీ, ఆ సంస్థ అప్పులు తమకు వర్తించవని పేర్కొన్నారు.
మరోవైపు విబిసి సంస్థ, గీతం యూనివర్శిటీ మధ్య ఉన్న లావాదేవీలు, ఆస్తుల బదిలీ అంశాల ఆధారంగా రెండూ పరస్పర సంబంధిత సంస్థలేనని విద్యుత్ సరఫరా సంస్థ టీఎస్ఎస్పీడీసీఎల్ వాదించింది. విబిసి ఫెర్రో అలాయ్స్ కంపెనీ చెల్లించా ల్సిన సుమారు రూ.118 కోట్ల విద్యుత్ బకాయిలు గీతం యూనివర్శిటీ చెల్లించా లంటూ ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో గీతం యూనివర్శిటీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ గీతం యూనివర్శిటీ రూ.54 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. దీంతో గీతం యూనివర్సిటీ ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజా విచారణలో.. విబిసి సంస్థకు గీతం యూనివర్శిటీకి మధ్య ఉన్న సంబంధం అంశాన్ని సవివరంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సింగిల్ బెంచ్‌కు సుప్రీంకోర్టు సూచించింది. అప్పటివరకు మధ్యంతర చర్యగా నాలుగు వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని గీతం యూనివ ర్శిటీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.






