Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమెరికాకు ఎదురుదెబ్బ.. ప్రతీకారం తప్పదంటూ ట్రంప్ హుంకరింపు
posted on: Apr 7, 2026 2:43PM

యుద్ధంలో అమెరికాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాను ఇరాన్ గట్టి దెబ్బకొట్టిందా? అమెరికా అహందెబ్బతిందా? అంటే తాజా పరిణామాలు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. , ఇరాన్ సరిహద్దుల్లోకి చొరబడిన అమెరికా నిఘా విమానాన్ని ఇరాన్ దళాలు కూల్చివేసాయి.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్ననేపథ్యంలో హుర్ముజ్ ప్రావిన్స్ సమీపంలోని సరిహద్దుల వద్ద ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు తమ దేశ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికాకు చెందిన మానవరహిత నిఘా విమానాన్ని ( గుర్తించి, తక్షణమే కూల్చివేసాయి. అందుకు సంబంధించి ఆ విమాన శిధిలాల ఫుటేజీని ఇరాన్ అధికారికంగా విడుదల చేయడంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది.
గత కొంతకాలంగా అమెరికా ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. అణు ఒప్పందాల విషయంలోనూ, ఆర్థిక ఆంక్షల విషయంలోనూ ఇరు దేశాల మధ్య తీవ్ర వైరం నెలకొంది. ఈ క్రమంలో అమెరికా తన అత్యాధునిక నిఘా విమానాలను ఇరాన్ సరిహద్దుల్లో మోహరించడం, ఇరాన్ వాటిని కూల్చివేయడం అనేది కేవలం ఒక ప్రమాదం కాదు, ఇది ఒక పెద్ద యుద్ధానికి సంకేతంగా మారుతోంది. ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా వెనకాడబోమని ఈ చర్య ద్వారా స్పష్టం చేసింది.
ఇరాన్ విడుదల చేసిన దృశ్యాల్లో అమెరికా విమానం శకలాలు ఎడారి ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉండటం కనిపించింది. ఆ విమానంలోని కీలక పరికరాలు, డాక్యుమెంట్లు మరియు ఇతర సాంకేతిక సామాగ్రిని ఇరాన్ స్వాధీనం చేసుకుంది. తాము శాంతిని కోరుకుంటున్నామని, కానీ తమ భూభాగంలోకి ఎవరైనా అక్రమంగా వస్తే సహించేది లేదని ఇరాన్ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ వీడియో సాక్ష్యాలు ఇప్పుడు అమెరికాకు మింగుడుపడని అంశంగా మారాయి.
ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ ప్రజలు ఈ చర్యను తమ దేశానికి గర్వకారణంగా అభివర్ణిస్తున్నారు. అదే సమయంలో పెంటగాన్ వర్గాలు దీనిపై తీవ్రంగా మండిపడుతున్నాయి. అంతర్జాతీయ జలాల్లో ఉన్న తమ విమానాన్ని కావాలనే ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా దీనికి ప్రతికారంగా తీవ్ర స్థాయిలో ఇరాన్ పై దాడులకు తెగబడే అవకాశాలున్నాయని అంతర్జాతీయ రక్షణ సంబధ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా మరో 24 గంటలు అంటూ ఇరాన్ కు స్పష్టమైన హెచ్చరిక చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఏది ఏమైనా ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి.


.webp)



