సుప్రీం కోర్టులోనూ రాజ్ కేసిరెడ్డికి చుక్కెదురు
posted on: Feb 9, 2026 4:11PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఏ1 అయిన రాజ్ కేసిరెడ్డికి సుప్రం కోర్టులోనూ చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన బెయిలు పిటిషన్ ను తోసిపుచ్చడంతో రాజ్ కేసిరెడ్డి బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం సోమవారం (ఫిబ్రవరి 9)న విచారించింది. ఈ సందర్భంగా రాజ్ కేశిరెడ్డి తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించడం ప్రారంభించగానే.. ఈ విషయంలో వినడానికేమీ లేదన్న సుప్రీం కోర్టు
మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేసిరెడ్డి ప్రధాన నిందితుడనీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు రెగ్యులర్ బెయిలు మంజూరు చేయలేమనీ స్పష్టం చేసింది. అన్ని విషయాలనూ పరిగణనలోనికి తీసుకున్న తరువాతనే ఏపీ హైకోర్టు రాజ్ కేశిరెడ్డికి రెగ్యులర్ బెయిలు నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుని ఉంటుందని పేర్కొంది.
అయినా రాజ్ కేశిరెడ్డి తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు రాజ్ కేశిరెడ్డి మద్యం కుంభకోణంలో కీల పాత్ర పోషించారనీ, ఈ స్థితిలో ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోబోమనీ, ఈ పరిస్థితుల్లో రాజ్ కేశిరెడ్డికి బెయిలు మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. ఈ దశలో రాజ్ కేశిరెడ్డి తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ ఈ కేసులో తన క్లయింట్ ఇప్పటికే 9 నెలలుగా జెయిలో ఉన్నారని చెప్పారు.
దీనిపై సుప్రీం కోర్టు.. 750 కోట్ల మనీ లాండరింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యక్తి 9 నెలలు జైలులో సమంజసమేనని పేర్కొంది. ఈ దశలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచేందుకు కొంత సమయం కావాలని రాజ్ కేశిరెడ్డి తరఫు న్యాయవాది కోరారు. దీనిపై సుప్రీం కోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.






