హైకోర్టులో తెలంగాణ సీఎం రేవంత్ కు చుక్కెదురు

posted on: Feb 6, 2026 11:20AM

 హైకోర్టులో  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది.  2023లో భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నాయకుడు, భూపాలపల్లి  ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

గండ్ర వెంకటరమణారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు తనపై నమోదు చేసిన క్రిమినల్ కేసును  కొట్టివేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు రేవంత్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేసింది.  కేసు తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...