Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంలో చుక్కెదురు
posted on: Feb 17, 2026 2:25PM

సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తులు , గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఓబులాపురం మైనింగ్ కేసుల నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం (ఫిబ్రవరి 17) కొట్టి వేసింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్లు దాఖలు చేయగా డిస్మిస్ చేసిన సంగతి విదితమే. ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆమె పిటిషన్లు కొట్టివేయడంతో శ్రీలక్ష్మికి శిక్ష తప్పదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.
ఓబులాపురం మైనింగ్, జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి తాను కేవలం ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే విధులు నిర్వహించానని.. ఇందులో ఎటువంటి వ్యక్తి గత ప్రయోజనం లేదని శ్రీలక్ష్మి తన పిటిషన్ ల లో పేర్కొన్నారు. పేర్కొన్నారు. అయితే సిబిఐ తరపు న్యాయవాదులు ఓబులాపురం మైనింగ్ లీజుల కేటాయింపులో.. క్విడ్ ప్రోకో వ్యవహారాల్లో శ్రీలక్ష్మి కీలక పాత్ర పోషించారని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం, కేసు ఈ దశలో ఆమె పేరు తొలగింపు సాధ్యం కాదని స్పష్టం చేసింది. సిబిఐ చూపిన అభియోగాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున, శ్రీలక్ష్మి ట్రయల్ కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం కోర్టు పేర్కొంది
ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగింది.
ఇప్పటికే ఈ కేసులో నిందితులందరికీ జైలు శిక్ష ఖరారు అయ్యింది. ఒక్క శ్రీ లక్ష్మీ విషయంలో మాత్రమే విచారణ జరగలేదు. అయితే తాజాగా ఆమె పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఆమెకు సైతం శిక్ష తప్పదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ కేసుల్లో ఆమె చాలా కాలం పాటు శ్రీలక్ష్మి రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విదితమే. కాగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక శ్రీలక్ష్మి తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు. ఆమెకు అప్పట్లో జగన్ సర్కార్ ప్రాధాన్యమిచ్చింది. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు.






