Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం..!
posted on: Jul 5, 2026 10:57AM
.webp)
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జయింది.. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఏడేళ్ల బాలుడు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మరో మృతుడి వివరాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవ సర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. బస్సు వేగం, డ్రైవింగ్ నిర్లక్ష్యం లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
ఈ విషాద ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను స్థానిక సీఐతో పాటు ఇతర అధికారులను ఫోన్‌లో అడిగి తెలుసుకు న్నారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర నివేదికను వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్టకాలం లో ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.



.webp)


