హైదరాబాదీ డాక్టర్ ఉగ్రలింకు.. సామూహిక విషప్రయోగానికి కుట్ర!

గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ఆదివారం(నవంబర్ 10)  అరెస్టు చేసిన హైద రాబాదీ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు.  

రాజేంద్ర నగర్ సర్కిల్ ఫార్ట్యూన్ కాలనీలో నివాసం ఉంటున్న మొహియుద్దీన్.. చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. ఆన్ లైన్ కన్సల్టెంట్ డాక్టర్గా పనిచేస్తూనే ఉగ్రవాదులతో పరిచయం పెంచుకు న్నాడు. పాకిస్థానీ హ్యాండ్లర్ల నుంచి అందిన ఆదేశాల మేరకు దేశంలో ప్రాణాంతకమైన రిసిన్ కెమికల్ (అత్యంత విషపూరితమైనది)తో దాడులు చేసేందుకు పథకం రచించినట్లు విచారణలో వెల్లడైంది.  

రిసిన్ ను ప్రపంచం లోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాల్లో ఒకటిగా నిపుణులు చెబు తున్నారు. రుచి, వాసన లేకపోవడం దీని ప్రత్యేకత. గ్లాసు నీటిలో కలిపి ఇస్తే ఎవరూ అనుమానించలేరని నిపుణులు చెబుతున్నారని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. సులభంగా దొరికే ఆముదం గింజల నుంచి దీనిని తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమా చారం. దేశంలోని ప్రధాన నగరాల్లో మంచినీళ్లు, గుడి ప్రసాదాల్లో ఈ విషాన్ని కలిపి, ప్రపంచంలోనే అతి పెద్ద సామూహిక విష ప్రయోగానికి పాల్పడి వేలాదిమంది మృత్యువాత పడేలా ప్రణాళికలు తయారు చేసు కున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu