Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ హయాంలో గనుల అక్రమాలపై ఈడీ సంచలన ప్రకటన
posted on: May 29, 2026 8:35PM

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో గనులశాఖలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 26వ తేదీన హైదరాబాద్, రాజస్థాన్‌లోని జయపూర్, తమిళనాడు లోని కోయంబత్తూర్ ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత స్థాయి సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు వెల్లడించింది.
ఈడీ దర్యాప్తు ప్రకారం ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీ (GCKC), టర్న్‌కీ సంస్థలకు సంబంధించిన కార్యాల యాలు, నివాస గృహాలు, అనుబంధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ కేసులో కీలకంగా భావి స్తున్న బోయిన్‌పల్లి శ్రీనివా సరావు, అశోక్‌కుమార్, గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి నివాసాల్లో కూడా సోదాలు జరిగినట్లు తెలిపింది. అయితే దర్యాప్తులో భాగంగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాల వ్యవహారంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఈడీ పేర్కొంది.
ముఖ్యంగా ఇసుక టెండర్ల కేటాయింపులో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిం చారని ఆరోపించింది. కొంతమంది ప్రైవేట్ కంపెనీ లకు అనుకూలంగా అప్పటి అధికారులు వ్యవహరించి నట్లు దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు లభించాయని ఈడి తెలిపింది.గనులశాఖ డైరెక్టర్‌గా పనిచేసిన వెంకటరెడ్డి కొన్ని సంస్థలకు అనుచిత ప్రయోజనాలు కల్పించినట్లు ఈడీ అనుమానిస్తోంది. టెండర్ విధానంలో పారదర్శకత పాటించలేదని, ప్రభుత్వా నికి భారీగా ఆదాయ నష్టం కలిగేలా చర్యలు జరిగా యని ఆరోపించింది.
సోదాల సమయంలో భారీ మొత్తంలో నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకు న్నట్లు ఈడీ వెల్లడించింది. మొత్తం రూ.1.53 కోట్ల నగదు, రూ.1.30 కోట్ల విలువైన వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఈడి తెలిపింది. అదనంగా స్థిరాస్తులు, చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, విదేశీ కరెన్సీ రూపంలో 1800 అమెరికన్ డాలర్లు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఈ కేసులో భాగంగా రూ.2,407 కోట్ల విలువైన ఒప్పందాలకు సంబంధిం చిన లావాదేవీలపై వివరణ ఇవ్వాలని సంబంధిత సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ భారీ మొత్తాల ఆర్థిక లావాదేవీ లకు సరైన లెక్కలు, పత్రాలు సమర్పించాలని ఆదేశిం చింది.ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గత ప్రభుత్వం హయాంలో గనులశాఖలో అవినీతి, అక్రమాలపై ఇప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈడీ తాజా ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించు కుంది. రానున్న రోజుల్లో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


.webp)
.webp)


