Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏఐ ప్రపంచంలో సంచలనం.. మస్క్ వర్సెస్ ఆల్ట్‌మన్
posted on: Apr 27, 2026 8:28AM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు ఒక కీలకమైన మలుపులో నిలబడింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ దాఖలు చేసిన దావా కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణగా కాకుండా.. మొత్తం ఏఐ పరిశ్రమ నైతికతను ప్రశ్నించే చారిత్రాత్మక విచారణగా మారింది. ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో ఈ నెల చివరినాటికి జ్యూరీ ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుండటంతో, టెక్ ప్రపంచం చూపు అంతా ఈ కేసు వైపే ఉంది.ఈ వివాదానికి ప్రధాన కారణం మారుతున్న ఏపెన్ ఏఐ స్వరూపం. 2015లో ఈ సంస్థను స్థాపించినప్పుడు.. ఇది పూర్తిగా లాభాపేక్ష లేని సంస్థగా.. మానవాళికి మేలు చేసే సురక్షితమైన ఏఐని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ సమయంలో ఈ సంస్థకు మస్క్ సుమారు 38 మిలియన్ల డాలర్ల భారీ విరాళాన్ని అందించారు. అయితే.. సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్ తమకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించి, ఈ సంస్థను లాభాపేక్ష కలిగిన వ్యాపార యంత్రంగా మార్చేశారని ఇప్పుడు మస్క్ ఆరోపిస్తున్నారు.
మస్క్ దాఖలు చేసిన ఫిర్యాదులో ప్రధానంగా మైక్రోసాఫ్ట్‌తో ఓపెన్ ఏఐ కుదుర్చుకున్న ఒప్పందాన్ని తప్పుబట్టారు. పబ్లిక్ గుడ్ కోసం పని చేయాల్సిన సంస్థ.. ఇప్పుడు ప్రైవేట్ ప్రయోజనాల కోసం పని చేస్తోందని ఆరోస్తున్నారు. ప్రస్తుతం ఏపెన్ ఐఐ విలువ 700 నుంచి 840 బిలియన్లకు చేరడం వెనుక భారీ కుట్ర ఉందని.. తన విరాళాలను తప్పుగా వినియోగించుకున్నారని మస్క్ అంటున్నారు. ఈ క్రమంలోనే సామ్ ఆల్ట్‌మన్, బ్రాక్‌మన్‌లను నాయకత్వ బాధ్యతల నుండి తొలగించాలని.. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యాన్ని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. మరోవైపు.. ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి. 2017 నుండే సంస్థకు భారీ పెట్టుబడులు అవసరమని, అందుకే లాభాపేక్ష విభాగం అనివార్యమైందని చెబుతున్నాయి. వాదిస్తున్నాయి. అంతే కాకుండా, మస్క్ సంస్థపై పూర్తి నియంత్రణ కోరారనీ.. అది సాధ్యం కాకపోవడంతోనే ఇప్పుడు తన ప్రత్యర్థి సంస్థ ఎక్స్ఏఐ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటున్నారని ప్రత్యారోపణలు చేస్తున్నారు. న్యాయస్థానం ఇప్పటికే ఈ కేసులోని మోసం ఆరోపణలను పక్కన పెట్టింది,
అయితే చారిటబుల్ ట్రస్ట్ నిబంధనల ఉల్లంఘన, అక్రమంగా లాభపడటం' వంటి అంశాలపై విచారణకు సిద్ధమైంది. ఒకవేళ జ్యూరీ మస్క్ వాదనతో ఏకీభవిస్తే.. ఓపెన్ ఏఐ సుమారు 134 బిలియన్ల డాలర్ల భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది సంస్థ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయడమే కాకుండా.. రాబోయే ఐపీఓ పై కూడా నీలినీడలు కమ్ముకునే అవకాశం ఉంటుంది.ఈ కేసు తీర్పు కేవలం ఒక సంస్థకే పరిమితం కాకుండా.. భవిష్యత్తులో ఏఐ గవర్నెన్స్ ఎలా ఉండాలో నిర్దేశించనుంది. లాభాపేక్ష లేని సంస్థలు బిలియన్ల డాలర్ల లాభాలను ఆర్జించే క్రమంలో తమ ప్రాథమిక లక్ష్యాలను పక్కన పెడితే వచ్చే చట్టపరమైన ఇబ్బందులను ఇది ఎత్తి చూపుతోంది.
దాతల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలి.. టెక్ దిగ్గజాల గుత్తాధిపత్యాన్ని ఎలా అరికట్టాలి అనే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. రానున్న వారాల్లో వెలువడబోయే విచారణ వివరాలు టెక్ పరిశ్రమలో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సామ్ ఆల్ట్‌మన్ తన సిఈఓ పదవిని నిలబెట్టుకుంటారా లేదా ఏపెన్ ఏఐ తన పాత రూపాన్ని సంతరించుకుంటుందా అన్నది ఇప్పుడు జ్యూరీ చేతుల్లో ఉంది. ఈ పోరాటం చివరికి మానవాళి శ్రేయస్సును గెలిపిస్తుందా లేక కార్పొరేట్ శక్తులదే పైచేయి అవుతుందా చూడాలి.
-సీతారాం కంఠంనేని



.webp)


