Latest News
ఆసుపత్రిలో హరికృష్ణ మృతదేహంతో సెల్ఫీ
posted on: Aug 31, 2018 5:23PM
రోజురోజుకి మానవత్వం తగ్గిపోతుంది అనటానికి ఇదే నిదర్శనం.. ఈమధ్య సెల్ఫీల పిచ్చి బాగా పెరిగి పోయింది.. కానీ కొందరి సెల్ఫీల పిచ్చి చూస్తే మాత్రం అసహ్యం వేస్తుంది.. ఎదుటి మనిషి చావుబతుకుల్లో ఉంటే సాయం చేయాల్సింది పోయి సెల్ఫీలు దిగటం, చనిపోయిన వారితో సెల్ఫీ దిగి పైత్యం చూపించటం.. ఈమధ్య ఇలాంటివి బాగానే చూస్తున్నాం.. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది.

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురైతే, కామినేని హాస్పిటల్ కి తరలించటం అక్కడ ఆయన మృతి చెందటం తెలిసిందే.. ఓ వైపు ఆయన మృతితో కుటుంబసభ్యులు, అభిమానులు విషాదంలో ఉంటే.. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది చేసిన ఓ పనికి అందరికీ కోపం వస్తుంది.. హరికృష్ణ మృతదేహంతో ఇద్దరు డ్యూటీ నర్సులు, ఒక వార్డు బాయ్, మరో వార్డ్ గర్ల్ కలిసి సెల్ఫీ దిగారు.. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆస్పత్రి సిబ్బంది చర్య పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. దీనిపై కామినేని ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది.. హరికృష్ణ భౌతికకాయం వద్ద సెల్ఫీ దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటన విడుదల చేసింది.. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొంది.






