కడప సీమాంధ్ర రాజధానా?
posted on: May 3, 2014 2:19PM
.jpg)
గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ చాలా ఎంపీ సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ని కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. రాష్ట్రాన్ని దారుణంగా విభజించింది. ఆ కాంగ్రెస్ పార్టీకే చెందిన కేంద్రమంత్రి జైరాం రమేష్ కూడా ఆంధ్రప్రదేశ్‌కి వెన్నుపోటు పొడిచాడు. ఈ మహానుభావుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే రాజ్యసభకి ఎన్నికయ్యాడు. రాష్ట్ర విభజన బిల్లును అడ్డగోలుగా రూపొందించి సీమాంధ్రులకు వెన్నుపోటు పొడిచిన ఘనాపాటీ జైరాం రమేష్. ఇప్పుడా జైరాం రమేషే కాంగ్రెస్ పార్టీకే మీ ఓట్లు వేయండని దేబిరిస్తూ సీమాంధ్రలో తిరుగుతున్నాడు. ఇంత వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌కి సీమాంధ్రులు ఎందుకు ఓటేస్తారనే కనీస పరిజ్ఞానం కూడా లేని జైరాం రమేష్ సీమాంధ్రలకు చేతగాని హామీలిస్తున్నాడు. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే సీమాంధ్రకు కడపని రాజధానిగా చేస్తాడట. ఈ హామీ ఇవ్వడానికి జైరాం రమేష్ ఎవరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాయం కాబోతోంది. పైగా సీమాంధ్రకి ఏ ప్రాంతాన్ని రాజధాని చేయాలనే విషయం మీద ఆల్రెడీ ఓ కమిటీ పనిచేస్తోంది. ఆ కమిటీ సీమాంధ్ర రాజధాని ఎక్కడ వుండాలో డిసైడ్ చేస్తుంది. అలాంటప్పుడు జైరాం రమేషే అన్నీ డిసైడ్ చేసే పనయితే కమిటీలు కాకరకాయలు వేయడం ఎందుకు?



.jpg)
.jpg)
.webp)

.webp)


