Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ముగిసిన మాజీ మంత్రి అప్పలరాజు పోలీసు కస్టడీ.!
posted on: Aug 5, 2026 9:42AM

గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కోర్టు అనుమతిపై మంగళవారం (ఆగస్టు 4) ఒక రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు కస్టడీ గడువు ముగియడంతో అదే రోజు సాయంతరం అంపోలు జైలుకు తిరిగి తరలించారు. సీదిరి అప్పలరాజు కుమారుడు నిర్లక్ష్యంగా బైక్ నడిపి గొర్రెల కాపరి దానయ్య మృతికి కారకుడైన కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికీ, పోలీసులను తప్పుదోవపట్టించడానికి ప్రయత్నించారంటూ సీదిరి అప్పలరాజు ఈ కేసులో పోలీసులు ఏ3గా నిందితుడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
రిమాండ్ లో ఉన్న అప్పలరాజును కోర్టు ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అప్పలరాజును మంగళవారం (ఆగస్టు 4) కట్టుదిట్టమైన భద్రత నడుమ కాశీబుగ్గ స్టేషన్‌కు తరలించి నాలుగు గంటల పాటు విచారించారు. దానయ్య మృతికి దారితీసిన రోడ్డు ప్రమాద ఘటన ఎప్పుడు జరిగింది,
ప్రమాదం జరిగిన సమయంలో అప్పలరాజు ఎక్కడ ఉన్నారు, ఘటన స్థలానికి ఆయన ఎంత సమయానికి చేరుకున్నారు తదితర అంశాలపై పోలీసులు ఆయనను ప్రశ్నించినట్లు తెలిసింది. కోర్టు విధించిన 1 రోజు పోలీస్ కస్టడీ గడువు పూర్తి కావడంతో, పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, పోలీసు బందోబస్తు మధ్య తిరిగి అంపోలు జైలుకు తరలించారు.
Seediri Appalaraju, Kasibugga Police Station, Danayya death case, Police custody, Ampolu Jail Srikakulam, former minister






