రేవంత్, బండి మధ్య రహస్య ఒప్పందం.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

posted on: May 13, 2026 10:05PM

తెలంగాణ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నేపధ్యంలో బీఆర్ఎస్ విమర్శల దాడి ఉధృతం చేసింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య సీక్రెట్ బంధం ఉందంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు   ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   సంచలన వ్యాఖ్యలు చేశారు.   తీవ్రమైన పోక్సో   కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయంగా పెను సంచలనం సృష్టించాయి.   మైనర్ బాలికపై జరిగిన అకృత్యానికి సంబంధించిన కేసులో నిందితులకు కొమ్ముకాసేలా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి  ప్రభుత్వం,  బీజేపీ అగ్రనేత బండి సంజయ్ మధ్య ఉన్నరహస్య పొత్తు కారణంగానే  ఈ కేసులో సాక్ష్యాధారాలు తారుమారయ్యాయ ఆరోపించారు.  రాజకీయ ప్రయోజనాల కోసం చిన్నారుల భద్రతను కూడా ఫణంగా పెడుతున్నారని విమర్శించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో బాధితులకు అండగా ఉండాల్సిన పాలకులు నిందితులకు కొమ్ము కాస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...