మిస్సింగ్‌కి ముందు పూర్ణిమ...ఇంటర్నెట్‌లో దేని కోసం సెర్చ్‌ చేసిందంటే?

హైదరాబాద్‌లో బాలిక పూర్ణిమ మిస్సింగ్‌ మిస్టరీగా మారింది. స్కూల్‌కి వెళ్తున్నానంటూ ఇంటి నుంచి బయటికెళ్లిన పూర్ణిమ ఏమైందో అంతుచిక్కడం లేదు. మరోవైపు 18 బృందాలతో ఏడు రోజులుగా గాలిస్తున్నా.. చిన్న క్లూ కూడా దొరక్క పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అసలు హైదరాబాద్‌‌లో మిస్సయిన పూర్ణిమ ఏమైనట్లు?, స్కూల్‌కు వెళ్తానని చెప్పి పూర్ణిమ ఎక్కడికి వెళ్లింది?, పూర్ణిమను ఎవరైనా కిడ్నాప్‌ చేశారా?, లేదంటే పూర్ణిమే... ఇంటి నుంచి వెళ్లిపోయిందా?, పూర్ణిమ మిస్సింగ్‌కి ముందు ఇంట్లో ఏం జరిగింది? స్కూల్‌లో ఎలా ఉండేది? ఆమె ఫ్రెండ్స్‌ ఎవరు? పూర్ణిమ మానసిక స్థితి ఎలా ఉంది? ఇలా అనేక కోణాల్లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.పేరెంట్స్‌, బంధువులు, టీచర్స్‌, ఫ్రెండ్స్‌ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే పూర్ణిమ ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు హూషారుగానే ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు. స్కూల్‌ యూనిఫాంలో గంతులేసుకుంటూ మెట్లు దిగడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. 

 

అయితే బాలికకు చదువు ఇష్టంలేదని, దాంతో తల్లిదండ్రులు మందలించారని ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు, అందుకే ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అయితే పూర్ణిమ తండ్రి ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు... ఆందోళన వ్యక్తంచేసినట్లు తెలిసింది. పూర్ణిమ ఇంటి నుంచి వెళ్లే ముందు... హౌ టు హ్యాంగ్‌ అంటూ గూగుల్‌లో సెర్చ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పూర్ణిమ మిస్సింగ్‌కు ప్రేమ వ్యవహారం కూడా కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. 

 

మరోవైపు పూర్ణిమ మిస్సింగ్‌ ఇష‌్యూని తల్లిదండ్రులు ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడం.... కేటీఆర్‌ స్పందించి.... బాలిక ఆచూకీ కనిపెట్టాలంటూ ఆయా పోలీస్‌ కమిషనర్లకు ఆదేశాలివ్వడంతో.... పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మొత్తం 18 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu