Latest News

ఇప్పుడే లొంగిపోను.. నాకు టైం కావాలి:శశికళ

posted on: Feb 14, 2017 3:04PM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను సర్వోన్నత న్యాయస్థానం దోషిగా నిర్థారించి నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. అయితే ఆమెను ఇవాళే అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో తాను బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో లొంగిపోవడానికి తనకు నాలుగు వారాల గడువు కావాలని శశికళ కోర్టులో పిటిషన్ వేయనున్నారు. తాను అనారోగ్య కారణాలతో బాధపడుతున్నానని...చికిత్స చేయించుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని పిటిషన్‌లో కోరనున్నారు. మరోవైపు శశికళను అదుపులోకి తీసుకునేందుకు తమిళనాడు, కర్ణాటక పోలీసులు భారీ ఎత్తున రిసార్ట్ వద్దకు చేరుకున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...