శశికళ.. ఏమన్నా మైండ్ గేమా...

 

అక్రమాస్తుల కేసులో భాగంగా శశికళ బెంగుళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవల ఆమె ఆస్తులపై వరుసగా ఐడీ దాడులు నిర్వహించగా.. కొన్నికోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. శశికళ ఆమె బంధువులు... ఇళ్లల్లో ఐటీ దాడులు నిర్వహించారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇటీవల ఆమె పెరోల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. శశికళ భర్త నటరాజన్ అనారోగ్యానికి గురవ్వడంతో ఆయనను కలిసేందుకు ఆమెకు అనుమతి ఇచ్చారు. అయితే ఇక్కడే ఒక్క విషయం... బయటపడింది. పెరోల్ మీద బయటకు వచ్చిన ఆమె తన భర్తను కలిసింది కేవలం ఒక్క రోజేనట. అయితే మిగిలిన రోజులు... ఆమె ఎక్కడికి వెళ్లింది.. ఏం చేసింది.. అనుకుంటున్నారా..? బయటకు వెళ్లిన ఆమె ఆ తర్వాత వ్యక్తిగత పనులు చూసుకున్నారట. అందులో భాగంగా 622 ఆస్తులను ఇతరుల పేర్లకు మార్చారట. ఇక ఆమె కదలికలపై పూర్తి స్థాయి నిఘా ఉంచిన అధికారులు, ఆమె ప్రతి అడుగును క్షుణ్ణంగా పరిశీలించి... ఆమె నివాసం, కార్యాలయాలు, సన్నిహితులు, బంధువులు, లాయర్లు తదితరులపై ఐటీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1400 కోట్ల రూపాయల పన్ను ఎగవేసినట్టు గుర్తించగా, సుమారు 30,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేసినట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ఆమె ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న పరప్పణ అగ్రహార జైలు సూపరింటెండెంట్‌ కు లేఖ పంపి విచారణకు అనుమతి పొందనున్నారని సమాచారం. మొత్తానికి శశికళ మాస్టర్ మైండ్ ని బాగానే వినియోగించారు. కానీ ఆమెపై నిఘా ఉంచిన అధికారులు ఆమె ఇంటిపై దాడులు నిర్వహించారు.