Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అడ్డంగా దొరికిపోయిన సర్పరాజ్!
posted on: Mar 31, 2026 2:13PM

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సర్పరాజ్ రాజస్థాన్ తో మ్యాచ్ లో అంపైర్లకు అడ్డంగా దొరికిపోయాడు. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో సర్పరాజ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తన ప్రస్తానాన్ని ప్రారంభించాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే సర్పరాజ్ నిబంధనలను ఉల్లంఘించి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. బ్యాటింగ్ చేయడానికి క్రీజ్ లోకి వచ్చిన సర్పరాజ్ బ్యాట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అంపైర్లు ఆ బ్యాట్ తో ఆడడానికి వీల్లేదని కుండబద్దలు కొట్టారు. బ్యాట్ కొలతలు, వెడల్పు, మందంపై ఐసీసీ స్పష్టమైన నిబంధనలు విధించింది.
సర్పరాజ్ తీసుకువచ్చిన బ్యాట్ ఆ నిబంధనలకు అనుగుణంగా లేదు. దీంతో అతను క్రీజులోకి రాగానే అంపైర్లు అడ్డుకుని ఆ బ్యాట్ తో ఆడడానికి వీల్లేదని కుండబద్దలు కొట్టారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సర్పరాజ్ డ్రెస్సింగ్ రూం నుంచి మరో బ్యాట్ తెప్పించుకుని ఆట కొనసాగించాడు. ఆ బ్యాట్ ను కూడా తనిఖీ చేసిన తరువాతే సర్పరాజ్ ను ఆడేందకు అనుమతించారు అంపైర్లు. ఈ సంఘటన సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది.


.webp)



