Latest News

సారా దుకాణాలు మళ్లీ తెరవాలి : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

posted on: Mar 9, 2026 10:21PM

 

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో మళ్లీ సారా దుకాణాలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో గ్రామాల్లో సారా తాగిన వారు 100 నుంచి 115 సంవత్సరాలు వరకు జీవించేవారని, కానీ ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న లిక్కర్ తాగడం వల్ల చాలా మంది 80 ఏళ్లకే మరణిస్తున్నారని వ్యాఖ్యానించారు.

అసలు సారా దుకాణాలను ఎందుకు మూసివేశారో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి, రాష్ట్రంలో మళ్లీ సారా దుకాణాలు తెరవాలని ప్రభుత్వాన్ని కోరుతానని తెలిపారు.

కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సారా దుకాణాలు తిరిగి ప్రారంభించారని, శాస్త్రీయంగా కూడా సారా ఆరోగ్యానికి హానికరం కాదని కొందరు చెబుతున్నారని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా విభిన్న అభిప్రాయాలకు దారి తీస్తున్నాయి.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...