Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమ్మ పేరిట మొక్క.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పవన్ వినూత్న కార్యక్రమం
posted on: Jun 5, 2026 12:23PM
.webp)
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం (జూన్ 5) తన తల్లి అంజనాదేవికి అంకిత మిస్తూ ఓ అరుదైన మొక్క నాటారు. పర్యావరణ పరిరక్షణ సందేశంతో పాటు ఒక భావోద్వేగపూరితమైన వ్యక్తిగత స్పర్శతో ఆయన చేసిన ఈ పని అందరినీ ఆకట్టుకుంటోంది.
ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ ఫ్లై పార్క్ సందర్శించిన పవన్ కళ్యాణ్... అక్కడ అరుదైన తెల్ల పొనికి మొక్కను నాటారు. ప్రపంచప్రసిద్ధి చెందిన కొండపల్లి బొమ్మల తయారీకి ఈ తెల్ల పొనికి కర్రనే ఉపయోగిస్తారు. ఈ అరుదైన మొక్కను పవన్ కల్యాణ్ తన తల్లి అంజనా దేవికి అంకితం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనకు జన్మనిచ్చిన తల్లిపై ప్రేమతో, గౌరవంతో ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా పచ్చదనాన్ని పెంచి, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.






