Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సంజు శాంసన్ హీరోచిత సెంచరీ.. చెన్నైకి తొలి విజయం
posted on: Apr 12, 2026 7:43AM
.webp)
వరుస పరాజయాల తరువాత చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా పుంజుకుంది. సొంత గడ్డపై శనివారం (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేస్తూ ఈ సీజన్‌లో తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ వీరోచిత శతకంతో చెలరేగగా, బౌలింగ్ విభాగంలో జేమీ ఓవర్టన్ పదునైన బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు.
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నైతొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శాంసన్‌కు తోడుగా యువ ఆటగాడు ఆయుష్ మాత్రే అద్భుతమైన సహకారం అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆయుష్ 36 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు పునాది వేశాడు. చివర్లో శివమ్ దూబే మెరుపులు మెరిపించడంతో చెన్నై స్కోరు 200 మార్కు దాటేసింది. ఈ సెంచరీతో సీఎస్‌కే తరఫున శతకం బాదిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజు చరిత్ర సృష్టించాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో ధాటిగానే ఆడింది. ఓపెనర్లు పాథుమ్ నిస్సంక, కేఎల్ రాహుల్ జట్టుకు మంచి పునాది వేశారు. అయితే మధ్య ఓవర్లలో చెన్నై బౌలర్లు అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. ముఖ్యంగా జేమీ ఓవర్టన్ తన అద్భుత స్పెల్‌తో 4 కీలక వికెట్లు తీసి ఢిల్లీ ఢిల్లీ పతనాన్ని శాసించాడు.
మరోవైపు అన్షుల్ కంబోజ్ 3 వికెట్లతో రాణించగా, అరంగేట్రం చేసిన గుర్జప్‌నీత్ సింగ్ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ 60 పరుగులతో చేసిన ఒంటరి పోరాటం వృధా అయ్యింది. చివరకు ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 189 పరుగులకే పరిమితమై, 23 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తన ఖాతా తెరిచింది. గత కొన్ని మ్యాచ్‌లుగా చెపాక్ మైదానంలో ఎదురవుతున్న ఓటముల పరంపరకు ఈ గెలుపుతో బ్రేక్ పడింది. సంజు శాంసన్ ఫామ్‌లోకి రావడం, బౌలింగ్ దళం సమష్టిగా రాణించడం సీఎస్‌కే అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.


.webp)



