కోల్ కతా డాక్టర్ హత్యాచార ఘటనలో దోషిగా సంజయ్ రాయ్
posted on Jan 18, 2025 2:17PM
దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయిన కోల్‌కతాలో ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచార కేసులో బంగాల్‌లోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. సంజయ్ రాయ్ ను దోషిగా ఖరారు చేసింది గత ఏడాది ఆగస్టు 9న ఈ హత్యాచార ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రధాన నిందితుడైన సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు మరుసటి రోజే అరెస్టు చేశారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ దర్యాప్తు చేసింది.సంజయ్ రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్టు సిబిఐ తేల్చేసింది. సంజయ్ రాయ్ కు మరణ శిక్ష విధించాలని సిబిఐ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. డిఎన్ఏ రిపోర్టుతో అనేక ఆధారాలను సిబిఐ సేకరించింది. ఈ నెల 9న ఇరు పక్షాల వాదనలు విన్నారు. సంజయ్ రాయ్ కు జనవరి 20న కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.