ఆపరేషన్ చేసి....వైర్ లోపల వదిలేసిన వైద్యుడు

 

ఓ ప్రైవేట్ హాస్పి టల్లో పనిచేస్తున్న ఓ వైద్యుడు... పేషంట్ మహిళకు సర్జరీ చేశాడు. సక్సెస్ అయిందని ఇక నుండి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెప్పి ఆమె వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు... ఇక తన ఆరోగ్యానికి డోకా లేదు అనుకున్న ఆ మహిళకు గత కొద్దిరోజులుగా కాళ్ల వాపుతో తీవ్రంగా బాధపడింది... ఎందుకు తన కాళ్లుకు  వాపు వస్తున్నయని నిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళింది. 

అక్కడి వైద్యులు సిటీ స్కానింగ్ చేయడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహం చెందిన ఆ మహిళ వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి తనకు సర్జరీ చేసిన డాక్టర్ పై ఫిర్యాదు చేసింది....పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసు కుంది.వివరాల్లోకి వెళితే....

సంగారెడ్డి జిల్లాలోని శ్రీ చరిత హాస్పిటల్ లో కిరణ్ కుమార్ అనే వ్యక్తి డాక్టర్ గా పని చేస్తున్నాడు. అరుణ అనే పేషెంట్ కాళ్ళ వాపుతో బాధపడుతూ శ్రీ చరిత హాస్పిటల్ కి వెళ్ళింది. ఆమెకు డాక్టర్ కిరణ్ కుమార్ వెరీకోజ్ వేన్ సర్జరీ చేశాడు. ఇకనుండి అలాంటి సమస్య ఉండదని చెప్పాడు. కానీ గత కొద్ది రోజుల తర్వాత తీవ్ర కాలు వాపు తో బాధపడు తున్న రోగి అరుణ నిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళింది. హాస్పిటల్ లో వైద్యులు ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో సర్జరీ చేసిన డాక్టర్ నిర్లక్ష్యం బయట పడింది.

 శ్రీ చరిత హాస్పిటల్ లో పనిచేస్తున్న కిరణ్ కుమార్ అనే వైద్యుడు అరుణ సర్జరీ చేసిన సమయంలో మీటర్ తీగ పేషెంట్ లోపల వదిలివేసి కుట్లు వేశాడు... ఆ మీటర్ తీగ కాస్త మహిళ గుండె వరకు చేరింది. దీంతో మహిళ  పరిస్థితి విషమంగా ఉంది. నిమ్స్ హాస్పటల్లో వైద్యులు వెంటనే ఆమెకు శస్త్ర చికిత్స చేసి మీటర్ తీగను బయటికి తీశారు...అనంతరం బాధిత కుటుంబం సంగారెడ్డి జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చరిత హాస్పిటల్ వైద్యుడు పై ఫిర్యాదు చేశారు. శ్రీ చరిత డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

 అరుణ, బాధిత పేషంట్

వెరికోస్ వేన్ అనే వ్యాధితో బాధపడు తున్నాను. మూడు నెలల క్రితం వైద్యం కోసం సంగారెడ్డి జిల్లా శ్రీ చరిత హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను శ్రీ చరిత హాస్పిటల్ డాక్టర్ కిరణ్ కుమార్ నాకు ఆపరేషన్ వేసి ఒక మీటర్ వైర్ శరీరం లోపలే వదిలేశాడు.డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నా ప్రాణం మీదికి వచ్చింది. నేను అనారోగ్యం పాలు అయ్యాను. రోజురోజుకీ నా ఆరోగ్యం క్షమించ పోవడంతో ఇటివలే నిమ్స్ హాస్పటల్లో అడ్మిట్ అయ్యాను. నిమ్స్ హాస్పిటల్ లో వైద్యులు సిటీ స్కానింగ్ చేయడం తో ఒక మీటర్ వయర్ నా శరీరం లోనే ఉన్నట్టుగా నిమ్స్ వైద్యులు గుర్తించారు. 

అనంతరం నిమ్స్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేసినా వైద్యులు ఒక మీటర్ వయర్ బయట తీశారు. శ్రీ చరిత హాస్పిటల్లో పనిచేస్తున్న కిరణ్ కుమార్ డాక్టర్ పై సంగారెడ్డి జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నాకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదు.నాకు ఇద్దరు పిల్లలు, నేను చనిపోతే వారికి దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేసింది.ప్రభుత్వం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu