సిగ్నల్స్ లో సంబంధం లేదు.. ఇంటర్నెట్ అక్కర్లేదు!

posted on: Mar 16, 2026 12:35PM

సాధారణంగా సిగ్నల్ లేకపోతే మొబైల్ ఫోన్ల నుంచి కాల్స్ చేయలేం, తీసుకోలేం. అలాగే వాట్సాప్ చాటింగ్, ఎక్స్ మెసేజింగ్ అసాధ్యం. అయితే ఇప్పుడు శామ్ సంగ్ ఓ అద్భుతాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. శామ్ సంగ్ తాజాగా విడుదల చేసిన గెలాక్సీ ఎస్ 26 సిరీస్ తో పాటు పాత మోడల్స్ కోసం కూడా విప్లవాత్మక మార్పులు చేస్తున్నది. నేరుగా శాటిలైట్ సాయంతో పని చేసే యాప్ లను శామ్ సంగ్ తాజాగా విడుదల చేసింది. 

కేవలం ఎమర్జెన్సీ ఎస్వోఎస్   మాత్రమే కాకుండా, నిత్యం వాడే పలు యాప్‌లు ఇకపై ఉపగ్రహ అనుసంధానంతో పనిచేస్తాయి.ఇంటర్నెట్ లేకపోయినా   వాట్సాప్, గూగుల్ మ్యాప్స్,  ఫేస్‌బుక్ మెసెంజర్, ఎక్స్ పోస్టింగ్స్, ఎమర్జెన్సీ హెల్త్ టిప్స్ వంటివన్నీ పని చేసేలా శామ్ సంగ్ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.   శామ్సంగ్.. గూగుల్, క్వాల్కమ్   సంస్థలతో కలిసి  నాన్-టెరెస్ట్రియల్ నెట్‌వర్క్ టెక్నాలజీని డెవలప్ చేసింది.  ఈ టెక్నాలజీ ద్వారా మీ ఫోన్‌లో సిగ్న  పోయినప్పుడు, ఫోన్ ఆటోమేటిక్‌గా  ఉపగ్రహాలతో కనెక్ట్ అవుతుంది. ఇందుకోసం శామ్సంగ్ గ్లోబల్ పార్ట్ నర్ లు స్టార్‌లింక్ (స్పేస్ఎక్స్),   స్కైలో  వంటి సంస్థల సాయం తీసుకుంటోంది.  ప్రస్తుతం అమెరికా, యూరప్,  జపాన్ వంటి దేశాల్లోని కొన్ని టెలికాం నెట్‌వర్క్‌లలో  ఈ ఫీచర్ ను అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఇండియాలో కి కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...