ఇమ్మడి రవి మామూలోడు కాదు.. సజ్జనార్ నోట సంచలన విషయాలు!
posted on Nov 17, 2025 1:59PM

ఇమ్మడి రవి.. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు మార్మోగుతోంది. రిలీజ్ అయిన సినిమాను రిలీజైనట్లుగానే నెట్ లో పెట్టేసి కోట్లు దండుకున్న ప్రముఖ పైరసీకారుడు. అతడి నేరం పైరసీ ఒక్కటే అనుకున్నారింత కాలమూ. అయితే ఆయన నేరాల చిట్టా చాల పెద్దదే ఉందంటున్నారు. బెట్టింగ్ యాప్ ల నుంచి మారుపేరుతో డ్రైవంగ్ లైసెన్సు, పాన్ కార్డులు పొందడం నుంచీ వేల సంఖ్యలో సబ్ స్క్రైబర్ల డేటా చోరీ చేయడం వరకూ ఐబొమ్మ రవి నేరాల చిట్టా చాలా పెద్దేదే ఉంది.
ఈ వివరాలన్నీ హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగరానికి చెందిన రవి.. మహారాష్ట్రలో ప్రహ్లాద్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. అంతే కాదు అతడి పాన్ కార్డు కూడా ప్రహ్లాద్ అనే పేరుమీదే ఉంది. తొలి నుంచీ కూడా క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న ఐబొమ్మ రవి, ఎంతో ముందు చూపుతో కరేబియన్ ఐలాండ్ పౌరసత్వం కూడా తీసుకున్నాడు. ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్.. ఎన్నో దేశాలు తిరిగాడు. తన పైరసీ నెట్ వర్క్ ను విస్తరించుకున్నాడు. అమెరికా, నెదర్లాండ్స్ లో సర్వర్లు పెట్టి.. టెలిగ్రామ్ యాప్ లో కూడా పైరసీ సినీమాలను అప్ లోడ్ చేశారు. ఈ పైరసీ ముసుగులో అన్లైన్ బెట్టింగ్ నూ ప్రమోట్ చేశాడు.
అదెలా అంటే.. ఐ బొమ్మ సైట్ ను క్లిక్ చేయగానే.. బెట్టింగ్ యాప్ సైట్ ఓపెన్ అవుతుంది. సినిమా మధ్యలో కూడా బెట్టింగ్ యాప్ ప్రకటనలు వచ్చాయి. వీటి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడు. అంతే కాదు.. ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చి పోలీసులు అతగాడి కోసం గాలింపు చేపడితే.. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ చాలెంజ్ చేశాడు. అయితే పోలీసులు వదలలేదు.. నెలల పాటు శ్రమించి, అతడి ఆచూకీ శోధించి ఎట్టకేలకు ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. ఇక ఐబొమ్మను ఎంకరేజ్ చేసి ఫ్రీగా సినిమాలు చూసిన వారి డేటా మొత్తం చోరీ చేశాడు.
ఫ్రీగా వస్తుంది కదా అని ఐ బొమ్మ ను ఎంకరేజ్ చేశారు. కానీ మీ డేటా మొత్తం చోరీ కి గురైంది. ఈ వివరాలన్నీ సజ్జనార్ వెల్లడించిన తరువాత ఇంత కాలం ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూసిన వారిలో ఆందోళన మొదలైంది. సినీ ప్రముఖులు చిరంజీవి సహా అందరూ ఐబొమ్మ రవి అరెస్టు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లేలా చేసిన ఐబొమ్మ రవి అరెస్టు శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు. పోలీసు శాఖకు కృతజ్ణతలు చెబుతున్నారు. అంత వరకూ బానే ఉంది. కానీ ఐబొమ్మ సబ్ స్క్రైబర్ల డేటా చోరీ ద్వారా ఇటు జనాలనూ దగా చేశాడు రవి. సబ్ స్క్రైబర్ల డేటా అమ్ముకోవడం ద్వారా సంపాదించిన సొమ్ముతోనే పెద్ద పెద్ద సర్వర్లను మెయిన్ టైన్ చేశాడు రవి. ఆ రకంగా చూస్తే సినిమా వాళ్ల కంటే జనమే ఎక్కువ నష్టపోయారని సజ్జనార్ చెబుతున్నారు.