నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు ఎవరూ రావొద్దు : సీపీ సజ్జనార్
posted on: Jan 24, 2026 6:02PM
.webp)
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ప్రాంతంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం నగరాన్ని కలవరపెట్టింది. నాంపల్లి ఎగ్జిబిషన్ సమీపంలోని భవనంలో మంటలు చెలరేగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఎవరూ రావద్దని హైదరాబాద్ పోలీసులు ప్రజలకు సూచించారు. ఎగ్జిబిషన్ పర్యటనను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అగ్నిప్రమాదం కారణంగా నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అబిడ్స్, నాంపల్లి, ఎంజే మార్కెట్, ఏక్‌మినార్ ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపో యాయి. ముఖ్యంగా నాంపల్లి–అబిడ్స్ రోడ్డులో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించడం తో అగ్నిమాపక, రెస్క్యూ బృందాల పనికి తీవ్ర ఆటంకం ఏర్పడింది.
అగ్నిప్రమాదం జరిగిన భవనం హిందీ ప్రచార సభ పేరుతో నిర్మించబడిన పురాతన భవనంగా గుర్తించారు. ఈ భవనం 1960లోనే కొందరు దాతలు ఇచ్చిన విరాళాలతో నిర్మించబడింది. ప్రముఖుడు అచ్యుత్ రెడ్డి ఇచ్చిన భూమిపై హిందీ ప్రచార సభ కోసం ఈ కట్టడం నిర్మించినట్లు సమాచారం. అయితే, గత కొంతకాలంగా ఈ భవనం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని ఆక్ర మించి షాపులు ఏర్పాటు చేసి వ్యాపారాలు నిర్వహి స్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయం పై గతంలోనే షాపులు ఖాళీ చేయాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని బేఖా తరు చేస్తూ ఇంకా అక్రమ కార్యక లాపాలు కొనసాగు తున్నాయని తెలుస్తోంది.
మొదట్లో భవనానికి సెట్‌బ్యాక్ ఉండేదని, అయితే ప్రస్తుతం సెట్‌బ్యాక్ లేకుండా ఫర్నిచర్ షాపులు ఏర్పాటు చేసి వ్యాపారం సాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కేసు కోర్టు లో ఉన్నప్పటికీ షాపులు కొనసాగిస్తూ దందా నడు స్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే నిర్లక్ష్యమే అగ్నిప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.ఈ అగ్నిప్రమా దంలో మొత్తం ఆరుగురు భవనంలో చిక్కుకున్నట్లు సమాచారం. వారిలో ఇద్దరు సిబ్బంది, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మహమ్మద్ ఇంతియాజ్ (27) – సిబ్బంది, సుమారు 10 ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్నాడు.సయ్యద్ హబీబ్ (40) – ఫర్నిచర్ తరలించే డ్రైవర్ గా పని చేస్తున్నాడు.అలాగే భవనంలో నివసిస్తున్న వాచ్‌మన్ కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు కూడా ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం.
తల్లిదండ్రులు లక్ష్మి, యాదమ్మ పని నిమిత్తం బయటికి వెళ్లిన సమయం లో, పిల్లలు అఖిల్ (11), ప్రణీత్ (7) సెల్లార్‌లో ఉన్నట్లు తెలిసింది. గత కొంతకాలంగా వాచ్‌మన్ కుటుంబం సెల్లార్‌లోనే నివాసం ఉంటోందని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి అగ్నిమాపక, పోలీసు బృందాలు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతుండగా, భారీ ట్రాఫిక్ కారణంగా సహాయక చర్యలు నెమ్మదించాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనలే ఈ దుర్ఘటనకు దారి తీసాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






