Latest News
బ్యాడ్మింటన్‌కు సైనానెహ్వాల్ గుడ్‌బై
posted on: Jan 20, 2026 11:53AM

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీర్ఘకాలికంగా గాయాలు వెంటా డుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మోకాళ్ల నొప్పులతో ఇప్పటికే రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉన్న సైనా.. ఇక తాను ఆడలేనని స్పష్టం చేశారు.మహిళల బ్యాడ్మిం టన్‌కు మార్గదర్శిగా నిలిచి ఎన్నో అత్యుత్తమ విజయాలు అందుకున్న సైనా.. ఓ పాడ్‌కాస్ట్ వేదికగా ఇకపై ఆడలేనని చెప్పారు. దీర్ఘకాలిక గాయాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండేళ్ల క్రితమే ఆడటం మానేశానని... ఏ మాత్రం ఆడగలిగే సామర్థ్యం లేనప్పుడు కథ ముగిసినట్లేనన్నారు.
ఆర్థరైటిస్ వచ్చింది, కార్టిలేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది, ఇక నేను ఆ స్థాయిలో ఆడలేనని నా తల్లిదండ్రులు, కోచ్‌లకు చెప్పాల్సి వచ్చిందన్నారు. ఇంతకు ముందు రోజుకు 8 నుంచి 9 గంటలు శిక్షణ తీసుకునేదాన్ననీ, ఇప్పుడు గంట, రెండు గంటల్లోనే మోకాలు వాపు వచ్చేస్తోందనీ అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచిన సైనా.. ఇక ఆడబోదన్న విషయాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సైనా.. చివరి సారిగా 2023 సింగపూర్ ఓపెన్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత నుంచి మోకాళ్ల నొప్పులతో పూర్తిగా విశ్రాంతిలో ఉన్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో ఎదురైన మోకాలి గాయం ఆమె కెరీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. అయినప్పటికీ, 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచి సత్తా చాటారు. కానీ ఆ తర్వాత కూడా గాయాలు వెంటాడుతూనే వచ్చాయి. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన సైనా నెహ్వాల్, ఆటకు వీడ్కోలు పలికినా.. ఆమె స్ఫూర్తి మాత్రం తరతరాలకు మార్గదర్శకంగా నిలవనుంది.


.webp)



