Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...23 క్రిమినల్ కేసులు.. 2017లోనే రౌడీషీట్.. సాయికృష్ణ క్రిమినల్ హిస్టరీ!
posted on: Jun 20, 2026 8:59AM

విజయవాడలో సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయి కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు వెనుక ఉన్న నేర చరిత్ర, దానికి అంటుకున్న రాజకీయ రంగులు చూస్తుంటే సామాన్య ప్రజలు విస్మయం చెందుతున్నారు. ఈ కేసు మూలాలను, ఆ రౌడీ షీటర్ వెనుక ఉన్న అసలు శక్తులు ఏమిటని పరిశీలిస్తే.. సాయికృష్ణ అనే ఈ వ్యక్తి కేవలం ఒక సాధారణ నేరస్థుడు కాద నీ.. వైసీపీ కీలక నేత దేవినేని అవినాష్‌కు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. దేవినేని అవినాష్ నీడలోనే ఇతను పెరిగి పెద్దయ్యాడని, నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాడని పలు ఆరోపణలు ఉన్నాయి.
సాయి కృష్ణ ట్రాక్ రికార్డ్ చూస్తే.. ఇతడిపై విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఏకంగా 23 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ 23 కేసుల్లో ఘోరమైన నేరాలు ఉన్నాయి. మైనర్ బాలికపై అత్యాచారానికి సంబంధించిన ఒక పోక్సో కేసు, ఒక హత్య కేసు, ఒక కిడ్నాప్ కేసు ఉన్నాయి. ఇవే కాకుండా గంజాయి, డ్రగ్స్ పెడ్లింగ్‌కు సంబంధించి మూడు కేసులు, దారిదోపిడీలకు సంబంధించి 4 కేసులు, ప్రజలపై దాడులు చేసినందుకు 5 అసాల్ట్ కేసులు ఉన్నాయి. అలాగే ఆస్తులు ధ్వంసం, చోరీలకు సంబంధించి మూడు కేసులు, వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసే ఎక్స్టార్షన్ కింద ఒక కేసు, గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద ఒక కేసుతో పాటు మూడు సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ కేసులు నమోదయ్యాయి. ఈ ఘోరమైన నేరాల తీవ్రతను బట్టి, 2017 జనవరి 15న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ పోలీసులు ఇతడిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సాధారణంగా 20 ఏళ్ల వయసున్న యువకుల భవిష్యత్తు నాశనం కాకూడదని పోలీసులు రౌడీ షీట్ పెట్టడానికి వెనుకాడతారు, కానీ ఇతని నేరాల తీవ్రత దృష్ట్యా చాలా చిన్న వయసులోనే రౌడీ షీట్ ఓపెన్ చేశారు.
ట్విస్ట్ ఏంటంటే, 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. దేవినేని అవినాష్ అధికార పార్టీలో చక్రం తిప్పినప్పటికీ ఈ పిల్ల సాయిపై ఉన్న రౌడీ షీటును ఎత్తేయించలేదు. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం అన్యాయంగా కేసు పెట్టి ఉంటే.. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ రౌడీ షీట్ ఎందుకు తొలగించలేదు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. వైసీపీ హయాంలో కూడా సాయికృష్ణ పై రౌడీ షీట్ అలాగే ఉందంటేనే.. అతడు పక్కా క్రిమినల్ అని వైసిపి నేతలకు కూడా తెలుసనే అర్ధం. సాయికృష్ణ ఫోన్ నుండి లభ్యమైన ఫోటోల్లో ఇతను భుజం మీద గొడ్డలి పెట్టుకుని, తుపాకీ కణతకు గురిపెట్టుకుని, మత్తు పదార్థాలు సేవిస్తూ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు. తానో పెద్ద క్రిమినల్ స్వయంగా చాటుకున్నాడు.
ప్రస్తుతం ఈ కేసు చుట్టూ జరుగుతున్న రాజకీయం విచిత్రంగా మారింది. సాయికృష్ణ దేవినేని అవినాష్ అనుచరుడు కనుక.. అతడి మిస్సింగ్ పై అవినాష్ మాట్లాడాలి. కానీ వైసిపి అధినాయకత్వం మాత్రం అవినాష్ ను మాట్లాడనీయకుండా, మాజీ మంత్రి అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, కురసాల కన్నబాబు వంటి వారి చేత మాట్లాడిస్తూ.. ఈ కేసుకు కులం కలర్ అద్దడానికి ప్రయత్నిస్తోంది. వాస్తవానికి వారికీ, విజయవాడ రౌడీ షీటర్ సాయికృష్ణకి సంబంధం ఏంటి? ఇదే వైసిపి కాస్ట్ పాలిటిక్స్ ను తేటతెల్లం చేస్తున్నది. సాయి కృష్ణ కాపు సామాజికవర్గానికి చెందినవాడు కనుక, , ఆ కులం కార్డును వాడుకుని రాజకీయ లబ్ది పొందడానికి వైసీపీ తమ పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు వంటి వారిని రంగంలోకి దింపింది. వాస్తవానికి ఈ కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజు కూడా అదే కాపు స సామాజికవర్గానికి చెందిన అధికారి. ఒక నేరస్థుడిని కాపాడటానికి, 23 ఘోరమైన కేసులు ఉన్న రౌడీ షీటర్ సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని వైసిపి చేస్తున్న కుల రాజకీయాన్ని సమాజికవర్గానికి చెందిన వారే తప్పుపడుతున్నారు. నేరస్థులకు కులం అండగా నిలవదని తేల్చి చెబుతున్నారు.


.webp)



