Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈ నెల 26న రైతు భరోసా నిధులు విడుదల!
posted on: Jun 18, 2026 9:20AM
.webp)
తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయానికి సంబంధించిన రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 26వ తేదీన ఖమ్మం జిల్లా మధిరలో ఒక భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
గత యాసంగి పంట కాలంలో నిధుల పంపిణీ ఆలస్యం కావడం, కేవలం 5,653 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడంతో రైతాంగంలో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం.. ఈసారి వానాకాలం సాగు ముగియక ముందే, సరైన సమయంలో పెట్టుబడి సాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ వానాకాలం సీజన్ ప్రారంభంలోనే 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు నేరుగా చేతికి అందుతుండటంతో తెలంగాణ రైతాంగంలో హర్షం వ్యక్తమౌతోంది.



.webp)


