Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇండియాకు రష్యా అండ.. అదనపు చమురు సరఫరాకు ఓకే
posted on: Mar 4, 2026 8:19AM
.webp)
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా ఇండియాకు అండగా నిలబడింది. యుద్ధ పరిస్థితుల కారణంగా గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా నిలిచిపోతే.. తానున్నానంటూ ముందుకు వచ్చింది. భారత్ కు అవసరమైన అదనపు చమురు సరఫరా చేయడానికి రష్యా రెడీ అని ప్రకటించింది.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడే అవకాశాలున్నాయన్నఆందోళన నేపథ్యంలో రష్యా ప్రకటన భారత్‌కు భారీ ఊరటగానే చెప్పుకోవాలి.
అదలా ఉంటే దేశంలో ఇంధన కొరతపై కేంద్ర పెట్రోలియం శాఖ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం దేశీయంగా 50 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.
50 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 80 డాలర్లు దాటింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ధరలు సుమారు 10 శాతం పెరిగాయి. ఇది భారత్ దిగుమతి బిల్లుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.






