రుద్రఎం–II.. భారత వైమానిక శక్తిలో కొత్త అధ్యాయం

posted on: Jun 5, 2026 4:40PM

ఒడిశా తీరంలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్- ITR వద్ద డీఆర్డీఓ, ఐఏఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన రుద్రఎం–II గగనతల భూతల క్షిపణి పరీక్ష భారత రక్షణ సాంకేతికతలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రయోగించిన ఈ క్షిపణి, ముందుగా నిర్దేశించిన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించడం ద్వారా.. భారత స్వదేశీ ఆయుధ వ్యవస్థల పరిపక్వతను ప్రపంచానికి మరోసారి చాటింది.

భారత వైమానిక దళం.. ఇప్పటివరకు ప్రధానంగా రష్యన్ మూలపు కేహెచ్–31 యాంటీ–రేడియేషన్ క్షిపణులపై ఆధారపడింది. శత్రు రాడార్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి వీటిని ఉపయోగించినప్పటికీ..  ఆధునిక యుద్ధ రంగంలో ఇవి పాతబడినవిగా పరిగణించబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో, డీఆర్డీఓ 2012–13 ప్రాంతంలో రుద్రఎం- సిరీస్ అభివృద్ధిని ప్రారంభించింది. రుద్రఎం–I యాంటీ రేడియేషన్ క్షిపణికాగా.. రుద్రఎం–II హై స్పీడ్, మల్టీ రోల్, ప్రెసిషన్ స్ట్రైక్ క్షిపణి. ఇక రుద్రఎం–III లాంగ్ రేంజ్,మోడ్ర‌న్ వేరియంట్. రుద్రఎం–II  ప‌రీక్ష విజ‌య‌వంతం కావ‌డం.. ఈ మొత్తం సీరీస్ లోనే గొప్ప ముంద‌డుగుగా నిలుస్తోంది.

రుద్రఎం–II అభివృద్ధి చేసిన‌ప్ప‌టి నుంచి.. తాజా పరీక్ష వరకు చూస్తే..   2015–2020 మ‌ధ్య కాలంలో దీన్ని రూపకల్పన చేయ‌గా..  ప్రైమ‌రీ స‌బ్ సిస్ట‌మ్స్ ని డెవ‌ల‌ప్ చేశారు.  2020–2023 పీరియ‌డ్ లో గ్రౌండ్ లెవ‌ల్ టెస్టులు, సీకర్- నావిగేషన్ వ్యవస్థల ధృవీకరణ వంటివి జ‌రిగాయి.  2024–2025లో సుఖోయ్–30 ఎమ్కేఐ వేదికపై ఇంటిగ్రేషన్ చేశారు. ఇక 2026 జూన్ 2న సుఖోయ్–30 ఎమ్కేఐ నుంచి ప్రయోగం చేయ‌గా.. ఇది టార్గెట్ ని పిన్ పాయింట్ ప‌ర్ఫెక్ష‌న్ తో ఛేజ్  చేయ‌గ‌లిగింది. 

రుద్రఎం–II గేమ్ చేంజర్ ఎలాగైందంటే.. ఇందులోని మాక్ 5.5 వేగం కీల‌కంగా చెప్పాలి.  ఎనిమీ  రాడార్స్ కి చిక్క‌కుండా వారిని కోలుకోలేని దెబ్బ తీస్తుంది. వారికి  క‌నీసం రియాక్ట‌య్యే టైం కూడా ఇవ్వ‌దు. ఇక దీని 300 కి.మీ దాడి పరిధి కూడా.. ముఖ్య‌మైన‌దే. శత్రు భూభాగంలో లోతైన లక్ష్యాలను సురక్షిత దూరం నుంచే ధ్వంసం చేయగలదు.

200 కిలోల వార్‌హెడ్.. రాడార్ స్టేషన్లు, కమాండ్ సెంటర్లు, ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలను నిర్వీర్యం చేయగల శక్తి కూడా  దీని కెపాసిటీకి  గ‌ల  కార‌ణాల్లో ఒక‌టి. హైబ్రిడ్ నావిగేషన్.. ఐఎన్ఎస్ +జీపీఎస్ + పాసివ్ హోమింగ్ సీకర్ కలయికతో అత్యంత కచ్చితత్వం ప్ర‌ద‌ర్శిస్తుంది. ఇక పోతే ఇది స్వదేశీ అభివృద్ధి కూడా. ఆర్సీఐ,  డీఆర్డీఎల్,  హచ్ఈఎమ్ఆర్ఎల్,  ఏర్డీఈ, హెచ్ఏఎల్,  ఆర్సీఎమ్ఏ, ఎమ్ఎస్క్యూఏఏ వంటి సంస్థల సమష్టి కృషి రుద్రఎం–II.   

ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా.. రక్షణ రంగంలో చట్టపరమైన మార్పులు తీసుకొచ్చారు. 2020 తర్వాత రక్షణ కొనుగోళ్లలో పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్టులు అమల్లోకి వచ్చాయి. విదేశీ క్షిపణుల దిగుమతిని తగ్గించడానికి, స్వదేశీ వ్యవస్థలకు ప్రాధాన్యత ఇచ్చే విధానాలు అమలులో ఉన్నాయి. రక్షణ కొనుగోలు విధానాలు.. డీఏపీ 2020 ప్రకారం, స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహం. రుద్రఎం–II ఈ విధానాలకు పూర్తిగా అనుగుణంగా ఉంది. 

ఇక‌ యుద్ధ చట్టాలు, అంతర్జాతీయ ప్రమాణాలు విష‌యానికి వ‌స్తే.. పాసివ్ హోమింగ్ సీకర్ ద్వారా రేడియో–ఫ్రీక్వెన్సీ ఉద్గారాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం. కోలాటరల్ డ్యామేజ్ తగ్గించే అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణం కావ‌డం కూడా కీల‌క‌మే. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ పరీక్షను  స్వదేశీ రక్షణ సాంకేతికత పరిపక్వతకు నిదర్శనంగా అభివర్ణించారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ విధానానికి ఒక స్టార్ క్యాంపెయిన‌ర్ కూడా. రక్షణ రంగంలో.. స్వదేశీ అభివృద్ధి పెరగడం వల్ల ఉద్యోగాలు, సాంకేతిక నైపుణ్యాలు, పరిశ్రమల విస్తరణ వంటి అంశాలు బలపడతాయి.

హైదరాబాదు, పుణే, నాగ్‌పూర్ వంటి నగరాలు.. రక్షణ తయారీ కేంద్రాలుగా మరింత బలోపేతం అవుతున్నాయి. భారత మీడియా రుద్రఎం–IIను ఒక గేమ్–చేంజర్, ఫోర్స్ మల్టిప్లయర్ గా అభివర్ణిస్తోంది. అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులు కూడా.. దీన్ని చైనా, పాకిస్తాన్ రాడార్ నెట్‌వర్క్‌లపై స్ట్రాట‌జిక్ అప్ప‌ర్ హ్యాండ్ గా చూస్తున్నారు.

భారత వైమానిక దళంపై దీని  ప్ర‌భావం  ఎలాంటిదో చూస్తే.. శత్రు రాడార్ వ్యవస్థలను ముందుగానే నిర్వీర్యం చేయడం ద్వారా.. ఎయిర్ సుపీరియారిటీ సాధించడంలో కీలక పాత్ర పోషించ‌గ‌ల‌దు. ఇక‌ సుఖోయ్–30 ఎమ్కేఐ, భవిష్యత్తులో టేజాస్ఎమ్కూ–II, ఏఎమ్సీఏ  వంటి వేదికలతో ఇంటిగ్రేషన్ అవకాశాలు ఏర్ప‌డతాయి. దీంతో ఇదో గేమ్ ఛేంజర్ గా నిలుస్తోంద‌న్న విశ్లేష‌ణ‌లు అందుతున్నాయ్.

పాకిస్తాన్ కి  చెందిన‌ ఎల్వై–80, చైనా కి సంబంధించిన‌ హెచ్క్యూ–9 వంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై ప్రభావమంతమైన ప్రతిస్పందన  క‌న‌బ‌రుస్తుంది. భారతదేశం స్టాండ్–ఆఫ్ ప్రెసిషన్ స్ట్రైక్ సామర్థ్యాన్ని పెంచుకోవడం కూడా ఇందులో ఉంది. రక్షణ స్వావలంబనలో ఇదొక  గ‌ర్వ‌కార‌ణంగా భావిస్తున్నా, కొందరు విశ్లేషకులు ఉత్పత్తి పరిమాణం, సమయపాలన, ఖర్చు నియంత్రణ వంటి అంశాలపై ప‌లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

అయితే రుద్రఎం–II.. భారత రక్షణ స్వావలంబనకు ప్రతీకగా భావించ‌డం అయితే  ఉంది. రుద్రఎం–II కేవలం ఒక క్షిపణి కాదు. ఇది భారత రక్షణ పరిశోధన, పరిశ్రమ, వైమానిక దళం, ప్రభుత్వ విధానాల సమష్టి శక్తి. శత్రు రాడార్ వ్యవస్థలను నిర్వీర్యం చేయగల సామర్థ్యం కూడా. దీని మాక్ 5.5 వేగం, 300 కి.మీ పరిధి, స్వదేశీ నావిగేషన్–సీకర్ వ్యవస్థలు.. ఇవి అన్నీ కలిపి, రుద్రఎం–IIను భారత వైమానిక శక్తిలో ఒక ఫోర్స్ మల్టిప్లయర్గా నిలబెడుతున్నాయి.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...