యాదాద్రికి పోటెత్తిన్న భక్తులు.. ఒక్క రోజే రూ. కోటికి పైగా ఆదాయం
posted on Nov 10, 2025 11:42AM
.webp)
కార్తీకమాసం సందర్భంగా యాదాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్తీక మాసంలో యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో యాదాద్రి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నారు. ఈ క్రమంలో యాదాద్రిలో ఆదివారం (నవబర్ 9) ఒక్క రోజు లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో దాదాపు రెండు వేల సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మొత్తం 1968 సత్యనారాయణ వ్రతాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.
వీటిలో యాదగిరి గుట్టలో 1758, పాతగుట్టలో 200 సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగినట్లు వివరించారు. అలాగే ఆదివారం ఒక్కరోజే యాదగిరి గుట్టకు కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ప్రసాదాల విక్రయాల ద్వారా 27లక్షల 43 వేల 220 రూపాయలు, వ్రతాల ద్వారా 19 లక్షల 58 వేల రూపాయలు, వీఐపీ దర్శనాల ద్వారా 16.96 లక్షల రూపాయలు, కొండపైకి వాహనాల ప్రవేశాల ద్వారా 9 లక్షల 17 వేల రూపాయలు, ఇతరత్రా మరో 8 లక్షల 16వందల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. కాగా కొండపై భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.