Latest News
కళ్లల్లో కారం కొట్టి రూ.కోటి దోపిడీ.. కుకట్ పల్లిలో సంచలన ఘటన
posted on: Mar 17, 2026 11:44AM

హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ దోపిడీ సంచలనం సృష్టించింది. భారీ మొత్తంలో నగదు ఉన్న బాక్సును బైకు పై తరలిస్తుండగా ఈ దోపిడీ జరిగింది. నగదు తరలిస్తున్న బైక్ ను వెంబడించిన దుండగులు ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి నగదు ఉన్న బాక్సును దోచుకెళ్లారు. ఈ సంఘటన కూకట్ పల్లి మెట్రో పిల్లర్ 836 వద్ద జరిగింది. దోపిడీకి గురైన సొత్తు కోటి రూపాయలుగా తేలింది. అంత పెద్ద మొత్తంలో సొమ్ము బైక్ పై తరలించడమేంటన్న అనుమానంతో నగదు తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ సొమ్ము హవాలా సొమ్ముగా భావిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం ఈ హవాలా వ్యవహారం పూర్తిగా సినిమా ఫక్కీలో జరిగింది. కేవలం రూ.10 నోటును గుర్తుగా చూపించి భారీ మొత్తంలో నగదు మార్పిడి జరిపినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ సందర్భంగా నగదు తరలిస్తున్న అజీముద్దీన్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు.
తాను, కుష్రో అనే మరో వ్యక్తీ అమీర్ వద్ద పని చేస్తున్నామన్న అజీముద్దీన్.. అమీర్ తమకు పది రూపాయల నోటు ఇచ్చి కూకట్‌పల్లిలో పవన్ అనే వ్యక్తికి అందజే యాలని సూచించాడనీ, ఆ నోటును చూపించిన తర్వాత పవన్ ఇచ్చే నగదును తీసు కుని ఇబ్రహీంకు అందజే యాలని ఆదేశించాడని తెలిపారు. దీంతో తాను కుష్రో కలిసి సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో కూకట్‌పల్లికి చేరుకుని పవన్‌ను సంప్రదించగా, గోకుల్ ఎన్‌క్లేవ్ వద్దకు రావాలని చెప్పాడు. అక్కడ రూ.10 నోటు చూపించగానే కార్టన్ బాక్సుల్లో రూ. కోటి నగదును అందజేశారని అజీముద్దీన్ పోలీసులకు వెల్లడించాడు.
ఆ నగదును తీసుకుని ఇబ్రహీంకు కాల్ చేయగా.. మరో ప్రదేశానికి రావాలని సూచించాడని తెలిపారు. ఈ క్రమంలో బైక్‌పై ప్రయాణి స్తున్న సమయంలో పిలర్ నెంబర్ 836 వద్దకు రాగానే, రెండు బైకుల్లో వచ్చిన దుండగులు తమపై కారం పొడి చల్లి దాడి చేసి... కత్తులతో బెదిరించి మొత్తం నగదును దోచుకుని పరారయ్యారని తెలిపాడు. కాగా ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దోచుకున్న సొమ్ముతో పరారైన వ్యక్తులను శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. వారు లక్నోకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, సీఐఎస్ఎఫ్ సిబ్బంది సహకారంలో ఇద్దరిని అదుపులోనికి తీసుకున్నారు. పరారైన మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో హవాలా లావాదేవీలు, అంతర్జాతీయ లింకులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


.webp)
.webp)


