మునుపెన్నడూ చూడని మిస్సైల్స్ తో దాడులు.. ట్రంప్ హెచ్చరిక

posted on: Mar 1, 2026 4:56PM

ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోవడంతో  ఇరాన్ తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. యూఎస్ సైనిక స్థావరాలపై భీకరదాడులు తప్పవని, దాడులు మరింత తీవ్రతరం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

 ఆ క్రమంలో ఇరాన్ ప్రతీకార దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ది ట్రూత్‌లో ఆదివారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ప్రతీకారానికి దిగకపోవడమే ఇరాన్‌కు మంచిది. ఇరాన్ ప్రతిదాడులు చేస్తే మరింత తీవ్రంగా దాడులు చేస్తాం. మునుపెన్నడూ చూడని మిస్సైల్స్‌తో దాడి చేస్తాం అని తేల్చి చెప్పారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...