ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసు.. డాక్టర్ ప్రభావతి కోసం పోలీసుల గాలింపు

మాజీ ఎంపీ, తెలుగుదేశం ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘు రామరాజు కస్టోడియల్ టార్ఛర్ కేసులో గుంటూరు జీజేహెచ్ మాజీ సూపరింటెండెంట్ అధికారి డాక్టర్ పద్మావతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఆమెను అరెస్టు చేయాల్సిందిగా విచారణ అధికారి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.  కోర్టు తన ముందస్తు బెయిలు పిటిషన్ డిస్మిస్ చేసిన నాటి నంచీ ఆమె అజ్ఝాతంలోకి వెళ్లిపోయారు.  ఆమె పరారైనట్లుగా ధృవీకరించిన పోలీసులు డాక్టర్ పద్మావతిని అరెస్టు చేయడానికి విస్తృతంగా గాలిస్తున్నారు. మొత్తం నాలుగు పోలీసుల బృందాలు డాక్టర్ పద్మావతిని పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి.

రఘురామకృష్ణం రాు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటి వరకూ నాలుగు సార్లు డాక్టర్ పద్మావతికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయినా ఆమె విచారణకు హాజరు కాలేదు. ఆమె అజ్ణాతంలోకి వెళ్లడంతో పోలీసులు ఆమె నివాసానికి  నోటీసులు అంటించారు. ఆమె ముందస్తు బెయిల్  పిటిషన్ ను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. అమె విదేశాలకు వెళ్లకుండా నిరోధించేందుకు పోలీసులు ఆమెపై లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేశారు.  

రఘు రామరాజుపై  థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే అభియోగంలో శరీరంపై ఎటువంటి గాయాలు లేవని డాక్టర్ పద్మావతి తప్పడు నివేదిక ఇచ్చారని ఆభియోగాలున్నాయి.రఘు రామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పటికే సీఐడీ విభాగపు మాజీ ఏఎస్పీ విజయ్ పాల్, కొడాలి నాని మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అనుచరుడిగా కొనసాగిన తులసి బాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.