వైపీపీలో చేరుతానంటూ దుష్ప్రచారం.. వంగవీటి ఆశాలత క్లారిటీ
posted on: Feb 23, 2026 8:09AM

వంగవీటి మోహనరంగా కుమార్తె వంగవీటి ఆశాలత తాను వైసీపీ గూటికి చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలకు ఖండించారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. జిల్లా కంభం చెరువును సందర్శించిన సందర్భంగా ఆమె మీడియాతో ఆదివారం (ఫిబ్రవరి 22) మాట్లాడారు. గత కొంత కాలంగా తన రాజకీయ ప్రవేశంపై రకరకాల ఊగాహానాలు వస్తున్నాయన్న ఆశాలత.. కొందరు సోషల్ మీడియాలో పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
ప్రస్తుతం తన దృష్టిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 'రాధా-రంగా మిత్రమండలిని ఏ బలోపేతం చేయడంపైనే కేంద్రీకృతం చేశానని ఆమె చెప్పారు. రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే. ఇప్పుడు ఆశాలత కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.



.webp)


