Latest News
మోదీకి వ్యతిరేకంగా టీఎంసీ నేతల నిరసన...
posted on: Jan 5, 2017 1:53PM
.jpg)
రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో టీఎంసీ పార్టీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎంపీను అరెస్ట్ చేసినందుకు గాను పార్టీ నేతలు ఈ రోజు న్యూఢిల్లీలోని పీఎంవో ఎదుట ఆందోళనకు దిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని... మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా తృణమూల్ నేతలు ఆందోళనను విరమించకపోవడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.






