Latest News

కుల్దీప్ యాదవ్ వివాహానికి రోకో

posted on: Mar 13, 2026 9:31AM

టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను వివాహమాడనున్నాడు.  ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ముస్సోరీలో వీరి వివాహం శనివారం (మార్చి 14)న జరగనుంది. ఈ వివాహానికి టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్  ముస్సోరీలోని చారిత్రక సావోయ్ హోటల్‌లో జరిగే ఈ వివాహానికి వచ్చే అతిథుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు.

మొత్తం హోటల్ మూడు రోజుల పాటు వివాహం కోసమే రిజర్వ్ చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండది.  కుల్దీప్ యాదవ్, వంశికల వివాహ నిశ్చితార్ధం గత ఏడాది జూన్ లో జరిగిన సంగతి విదితమే. ముందుగా అనుకున్న ప్రకారం వీరి వివాహం గత ఏడాది నవంబర్ లో జరగాల్సి ఉంది. అయితే  కుల్దీప్ యాదవ్ దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఉండటంతో వాయిదా పడింది.

ఇటీవల అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి టీ20 ప్రపంచకప్‌ను నిలబెట్టుకున్న భారత జట్టులో కుల్దీప్ సభ్యుడిగా ఉన్న సంగతి విదితమే. టోర్నీలో కొన్ని మ్యాచ్ లు ఆడాడు. ముఖ్యంగా  పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టి తనదైన ముద్ర వేశాడు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...