Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...షాకింగ్ ఫ్యాక్ట్స్... బిచ్చగాళ్లు కాదు కోటీశ్వరులు...
posted on: Nov 21, 2017 3:43PM
.jpg)
ఇటీవల కాలంలో వచ్చిన బిచ్చగాడు సినిమా గుర్తుండే ఉంటుంది కదా... తన తల్లిని కాపాడుకోవడానికి ఓ కోటీశ్వరుడు కొన్ని రోజులు భిక్షాటన ఎత్తుతాడు. ఇక ఈసినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెపుతున్నారనుకుంటున్నారా..? ఎందుకంటే.. హైదరాబాద్ లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో సిటీలో భిక్షాటనను నిషేధించిన సంగతి తెలిసిందే కదా. బిచ్చగాళ్లందరినీ చర్లపల్లి ఓపెన్ జైల్లో ఉన్న ఆనందాశ్రమానికి తరలించారు. అయితే అక్కడ కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆశ్రమంలోఉన్న వారి వివరాలు నమోదు చేస్తున్న నేపథ్యంలో భిక్షాటన చేసేవాళ్లలో కొంత మంది కోటీశ్వరులు కూడా ఉన్నారన్న విషయం బయటపడింది.
ఫర్జూనా అనే 50 ఏళ్ల మహిళ తాను ఎంబీఏ పూర్తి చేసి, లండన్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసినట్లు తెలిపింది. ప్రస్తుతం లంగర్ హౌస్‌లో భిక్షాటన చేస్తున్న ఆమె వివరాలు చెబుతున్నపుడు ఆమె అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడటం విని పోలీసులు కంగుతిన్నారు. భర్త చనిపోయాక, ఆస్తులను బంధువులు కబ్జా చేయడంవల్ల.. సమస్యలు తీవ్రం కావడంతో మనశ్శాంతి కోసం భిక్షాటన చేయమని ఓ మతగురువు చెప్పడంతో దర్గా దగ్గర బిచ్చగత్తెగా మారింది. ఇక ఆ తర్వాత ఆమె కుమారుడు వచ్చి అఫిడవిట్ సమర్పించి ఫర్జూనాను తీసుకెళ్లాడు. ఇక రబియా బైస్రా అనే మహిళది కూడా ఇలాంటి కథే. ఆమె అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్. కోటీశ్వరురాలు. దగ్గరి బంధువులే ఆస్తి కోసం మోసం చేయడంతో ఓ దర్గా దగ్గర బిచ్చగత్తెగా మారాల్సి వచ్చింది. ఆమెను ఆశ్రమానికి తరలించారని తెలిసి బంధువులు వచ్చి జాగ్రత్తగా చూసుకుంటామని డిక్లరేషన్ ఇవ్వడంతో పోలీసులు ఆమెను వారితో పంపించారు. మొత్తానికి బిచ్చగాడు సినిమాను రీల్ లో కాకుండా రియల్ లైఫ్ లో చూపించారు.


.jpg)



