Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, హిట్ మెన్ రోహిత్ శర్మకు పొమ్మనలేక పొగ.!?
posted on: Jul 18, 2026 10:14AM
.webp)
హిట్ మన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించిన వార్తలు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే మ్యాచ్ వేదికగా హిట్ మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడన్న ప్రచారంజోరుగా సాగుతోంది. ఆదివారం (జులై 19) లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డేయే రోహిత్ శర్మ చివరి మ్యాచ్ అన్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. దీంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు అయితే ఇది రోహిత్ శర్మ సొంత నిర్ణయమా? బిసిసిఐ పెద్దలు, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మకంగా పొమ్మనలేక పెడుతున్న పొగా అన్న అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి.
కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ సోషల్ మీడియా కథనాల ప్రకారం.. 2027 వన్డే ప్రపంచ కప్ నాటికి రోహిత్ శర్మ వయసు 40 ఏళ్లకు చేరుకుంటుంది. ఇంతటి సుదీర్ఘ కాలం పాటు అతడు వన్డే ఫార్మాట్‌లో కొనసాగడం, ఫిట్‌నెస్ కాపాడుకోవడం కష్టమనే అభిప్రాయంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది. అందుకే భవిష్యత్తు జట్టు నిర్మాణంలో భాగంగా యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గట్టిగా భావిస్తున్నారు. వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ, ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకుంటే మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైనట్టే అవుతుంది. ఈ నేపథ్యంలోనే.. రోహిత్ శర్మ కెరీర్‌లో లార్డ్స్ లో ఆదివారం (జులై 19) జరిగే మ్యాచే చివరి మ్యాచ్ అవుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలు సందర్భాలలో 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలనే బలమైన ఆకాంక్షను రోహిత్ వ్యక్తం చేశాడు. అయితే అతడికి ఆ అవకాశం ఇవ్వకుండా బీసీసీఐ పొమ్మనలేకపోగపెడుతున్నట్లుగా కనిపిస్తోందని రోహిత్ అభిమానలు అంటున్నారు. అయితే రోహిత్ శర్మ రిటైర్ మెంట్ కు సంబంధించి అతడి నుంచి కానీ, బీసీసీఐ నుంచి కానీ ఇంత వరకూ ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు.
Rohit Sharma retirement rumours, Lords ODI match, Gautam Gambhir planning, 2027 ODI World Cup, BCCI selection updates, Indian cricket team news






