Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వింటేజ్ రోహిట్.. లార్డ్స్ లో రోహిత్ శర్మ విశ్వరూపం.!
posted on: Jul 20, 2026 6:46AM

ఇదే ఆఖరు మ్యాచ్ అన్నారు. ఫిట్ నెస్ లేదు. ఫామ్ లేదు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కు పనికి రాడు అని విమర్శలు గుప్పించారు. టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ పై గత కొద్ది రోజులుగా.. సోషల్ మీడియాతో పాటు ప్రధాన స్రవంతి రోహిత్ రిటైర్మెంట్ పైనే భారీ స్థాయిలో చర్చ జరిగింది. వీటన్నిటికీ రోహిత్ అనితర సాధ్యమైన రీతిలో బదులిచ్చాడు. విమర్శకులకు నోటితో కాకుండా బ్యాట్ తో సమాధానమించ్చాడు. ఒక అద్భుత సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించారు. ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా లార్డ్స్ వేదికగా ఆదివారం (జులై 18) జరిగిన మ్యాచ్ లో రో‘హిట్’శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. శుభమన్ గిల్, విరాట్ కోహ్లీలతో సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పి మ్యాచ్ ను దాదాపు గెలిపించినంత పని చేశాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తనలో సత్తా తగ్గలేదని, జట్టును ముందుండి నడిపించే సత్తా తనలో ఇంకా పుష్కలంగా ఉందని చాటాడు.
సాధారణంగా దూకుడుగా ఆడే రోహిత్, ఈ మ్యాచ్‌లో ఆరంభంలో ఆచితూచి ఆడాడు. ఒకింత నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. లూజ్ బాల్ వచ్చే వరకూ వెయిట్ చేశాడు. స్టాల్ సెలక్షన్ కూడా సెలక్టివ్ గా ఉంది. లూజ్ బాల్స్ ను బౌండరీకి తరలిస్తూ.. మంచి బంతులకు గౌరవం ఇస్తూ ఇన్నింగ్స్ నిర్మించాడు. క్రమంలో 53 బంతుల్లోనే 51 పరుగులు సాధించాడు. అక్కడ నుంచి గేర్ మార్చాడు. తన సహజ శైలికి భిన్నంగా కేవలం ఫోర్లూ, సిక్సర్లే కాకుండా.. సింగిల్స్, డబుల్స్ తీస్తూ, వికెట్ల మధ్య వేగంగా పరుగెడుతూ భారీ లక్ష్య ఛేదనను ముందుండి నడిపించాడు. అలాగే తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్లతో కళ్లు చెదిరే సిక్సర్లు కూడా బాదాడు. చివరకు 110 బంతుల్లో 138 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ ఐదు కళ్లు చెదిరి సిక్సర్లు, 17 ఫోర్లూ బాదాడు.
గత కొంతకాలంగా రోహిత్ శర్మ ఫామ్‌పై, రాబోయే వన్డే ప్రపంచకప్‌లో స్థానంపై వ్యక్తమౌతున్న సందేహాలకు రోహిత్ శర్మ ఈ ఇన్నింగ్స్ తో సమాధానం చెప్పేశాడు. ఈ క్రమంలో రోహిత్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. వన్డేలలో రోహిత్‌కు ఇది 34వ శతకం. దీనితో అత్యధిక వన్డే శతకాల జాబితాలో విరాట్ కోహ్లీ (54), సచిన్ టెండూల్కర్ (49)ల తర్వాత స్థానంలో మూడో స్థానంలో నిలిచాడు. అలాగే ఇంగ్లాండ్ గడ్డపై ఇది రోహిత్ కు 8వ సెంచరీ, ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాటర్ గా రికార్డు సాధించాడు. అలాగే 39 ఏళ్ల వయసులో, రోహిత్ సాధించిన ఈ సెంచరీతో ఏ అంతర్జాతీయ ఫార్మాట్‌లోనైనా ఇండియా తరఫున ఆ వయస్సులో సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంత వరకూ ఈ రికార్డు సచిన్ పేరుపై ఉండేది.


.webp)



