Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రోహిత్ శతకం వృధా.. లార్డ్స్ లో ఇంగ్లాండ్ విజయం.. సిరీస్ కైవశం.!
posted on: Jul 20, 2026 6:17AM
.webp)
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్ 141 పరుగులతో శతకబాదాడు. జాకబ్ బెథెల్ 91 పరుగులతో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యంతో బలమైన పునాది వేశారు. ఆ తర్వాత వచ్చిన జో రూట్ 74 పరుగులు, కెప్టెన్ జాస్ బట్లర్ కేవలం 13 బంతుల్లోనే 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణకు 2 వికెట్లు దక్కగా, మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
388 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ న ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత అభిమానుల్లో విజయంపై ఆశలు రేపారు. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ 84 బంతుల్లో 77 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 74 పరుగులు చేసి రాణించాడు. వీరు రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించడంతో భారత జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది.
ఇటీవలి కాలంలో ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతూ.. జట్టులో స్ధానమే అనుమానమన్న రీతిలో విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. 85 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో సెంచరీ పూర్తి చేసిన రోహిత్, మొత్తం 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 పరుగులు చేశాడు. ఈ శతకంతో రోహిత్ శర్మ క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన మొదటి భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. అ . ఇది రోహిత్‌కు 34వ వన్డే సెంచరీ కావడం విశేషం.
కానీ బెథెల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ అవుటైన తర్వాత, భారత మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఇషాన్ కిషన్ 14 పరుగులు, శ్రేయస్ అయ్యర్ డకౌట్ కాగా, కెఎల్ రాహుల్ 12 పరుగులకే వెనుదిరిగారు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు. భారత్ ఇంగ్లాండ్ కు దీటుగా పోటీ ఇవ్వగలిగిందంటే.. అది రోకో (రోహిత్, కోహ్లీల) పోరాటంతోనే సాధ్యమైంది. టీమ్ ఇండియా బ్యాటర్లలో స్కిప్పర్ శుభమన్ గిల్, రోకో వినా మిగిలిన ఆటగాళ్లంతా ఇటా వచ్చి అలా వెళ్లారు. దీంతో టీమ్ ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 27 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
Rohit Sharma Century Lords, India vs England 3rd ODI, Rohit Sharma 138 Runs, IND vs ENG ODI Series 2026



.webp)


